Health Benefits : ఐదే ఐదు నిమిషాల్లో ఎలాంటి నొప్పి లేకుండా పులిపిర్లను తొలగించొచ్చు.. ఎలాగో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : ఐదే ఐదు నిమిషాల్లో ఎలాంటి నొప్పి లేకుండా పులిపిర్లను తొలగించొచ్చు.. ఎలాగో తెలుసా?

Health Benefits : చాలా మంది మొహంపై నల్ల మచ్చలు, పుట్టు మచ్చలు, పులిపిర్లు చాలా సహజం. కానీ ఆడ వారిలోనే ఎక్కువగా పులిపిర్లు రావడానికి ఒక కారణం కూడా ఉందట. వైరస్ తో పాటు ఒత్తిడి, నీరసం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, హైపర్ టెన్షన్, మానసిక ఆందోళన, హార్మోన్ అన్ బ్యాలెన్స్, హెచ్బీ లెవెల్స్ తగ్గిన కూడా పులిపిర్లు వస్తాయి. పులిపిర్లు శరీరంలో ఎక్కడ పడితే అక్క కళ్ల కింద బుగ్గలపై పెదవి కింద […]

 Authored By pavan | The Telugu News | Updated on :29 May 2022,3:00 pm

Health Benefits : చాలా మంది మొహంపై నల్ల మచ్చలు, పుట్టు మచ్చలు, పులిపిర్లు చాలా సహజం. కానీ ఆడ వారిలోనే ఎక్కువగా పులిపిర్లు రావడానికి ఒక కారణం కూడా ఉందట. వైరస్ తో పాటు ఒత్తిడి, నీరసం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, హైపర్ టెన్షన్, మానసిక ఆందోళన, హార్మోన్ అన్ బ్యాలెన్స్, హెచ్బీ లెవెల్స్ తగ్గిన కూడా పులిపిర్లు వస్తాయి. పులిపిర్లు శరీరంలో ఎక్కడ పడితే అక్క కళ్ల కింద బుగ్గలపై పెదవి కింద మెడపైన చేతుల పైన వస్తూ ఉంటాయి. ఇది ఉండటం వల్ల బయటకి వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అందు వల్ల కొంత మంది పులిపిర్లను కాల్చడం, కత్తిరించడం వంటివి చేస్తారు. దీని వల్ల ఎంత నొప్పి కల్గినా, చర్మం అంతా కందిపోయినా తమ అందం కోసం అలాగే చేస్తుంటారు.

కానీ అలా చేయడం అంత మంచిది కాదు. పులిపిర్లను తొలగించాలంటే లోపలి నుంచి పోయేలాగా మెడిసిన్ ఉపయోగించాలి. పులిపిర్లు కల్గడానికి కారణం అయిన వైరస్ ను తొలగించే శక్తి వెల్లుల్లికి ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే మెడిసినల్ వాల్యూస్ వల్ల పులిపిర్లను మూలాల నుంచి తొలగిస్తుంది.ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తీస్కొని పొట్టు తీసి మెత్తగా దంచుకోవాలి. వెల్లుల్లి బాగా దంచుకొని ఏదైనా సరైన సాయంతో వడ కట్టుకొని జ్యూసు తీసుకోవాలి. తర్వాత దీనిలో అర చెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఒక చెంచా బేకింగ్ సోడా పడదు అనుకున్న వాళ్లు సున్నం కూడా వేసుకోవచ్చు. మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పులిపిర్లు ఉన్న చోట వరుసగా మూడు రోజులపాటు అప్లై చేయడం వల్ల ఎటువంటి నొప్పి లేకుండా పులిపిర్లు రాలిపోతాయి.

amazing Health Benefits for warts removing with out pain

amazing Health Benefits for warts removing with out pain

దీన్ని ఇయర్ బడ్ లేదా టూత్ పిక్ తో స్పాట్ లాగా అప్లై చేసుకోవాలి. అంతే తప్ప మీరు సొంతంగా కాల్చడం, కత్తిరించడం, గిల్లడం వంటివి అస్సలే చేయకూడదు. ఇది అప్లై చేసి ఒక అరగంట వరకు దాన్ని ఏం చేయకుండా ఆరిపోయేంత వరకు అలా వదిలేయాలి. పులిపురి ఉండటం వల్ల నొప్పి ఉండదు. కానీ ఇరిటేషన్ చిరాకు వస్తుంది. చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. వెల్లుల్లి పులిపిర్లను కల్గించే వైరస్ లు మూలాల నుండి చంపి పులిపిర్లను రాలిపోయేలాగా చేస్తుంది. ఈ చిట్కా చాలా బాగా పని చేస్తుంది. పులిపిర్లు కూడా రాలిపోవడం ఖాయం. ఈ సులువైన చిట్కాతో మీరు కూడా పులిపిర్లు నొప్పి లేకుండా పోగొట్టుకోవచ్చు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది