Health Benefits : పొట్టలో పేరుకు పోయిన మలాన్నంతటిని బయటకు తోసేసే అద్భుతమైన చిట్కా..!
Health Benefits : మనం ఎక్కువగా సీజనల్ ఫ్రూట్స్ తింటూ ఉంటాం. కానీ ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో దొరికే ఫ్రూట్స్ ను కూడా మన ప్రాంతానికి దిగుమతి చేసుకుంటున్నారు. పండ్లు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవి మన ప్రాంతంలో దొరికే పండ్లు అయినా వేరే ప్రాంతాల నుంచి తెచ్చుకున్న పండ్లు అయినా వాటి వల్ల లాభమే కల్గుతుంది కానీ ఎలాంటి నష్టం ఉండదు. ఇతర ప్రాంతాల నుండి తెచ్చుకున్న పండ్లలో కివీ చాలా ముఖ్యమైంది. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఉద్యోగ, వ్యాపారాల వల్ల వ్యాయామం చేయకపోవడం వల్ల అన్ని ఉడికినవి, వేయించినవి తినడం వల్ల నూనెలో దేవుకొని తినడం వల్ల పొటాషియం కాల్షియం వంటివి తగ్గిపోవడం వల్ల పేగుల్లో కదలికలు కూడా తగ్గిపోయాయి. పేగుల కదలికలు తగ్గడం వల్ల మనం బయటకు పోదు. శరీరంలో వ్యర్థాలు బయటకు పోవు.
పేగుల్లో స్ట్రక్ అవడం వల్ల నిల్వ ఉండటం వల్ల హార్డ్ ఐపోతుంది. హార్డ్ అవ్వడం వలన మనబద్ధకం సమస్య రావడం వెల్లినప్పుడు పది పదిహేను నిమిషాల పాటు ఉండటం, ఒత్తిడి అవ్వడం జరుగుతుంది.
మలం బయటకి వచ్చిన కూడా గట్టిగా, ఉండలుగా రావడం జరుగుతుంది. మల బద్ధకం సమస్య తగ్గాలన్నా.. మలం స్మూత్ గా రావాల్న్నా.. పేగుల్లో కదలికలు సక్రమంగా జరగాలన్నా కివీ ఫ్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా నిరూపించబడింది. 2019వ సంవత్సరంలో నాటింగ్ హామ్ యూనివర్సిటీ హాస్పిటల్ యూకే వారు మల బద్ధకం సమస్య ఉన్న వారిపై కివి ఫ్రూట్ మూడు వారాల పాటు ఇచ్చి పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలలు కివి ఫ్రూట్ వరుసగా మూడు వారాల పాటు తినడం వల్ల మల బద్ధకం సమస్య తగ్గుతుందని నిరూపించబడింది.
కివీ ఫ్రూట్ రోజు ఉదయం రెండు, మధ్యాహ్నం రెండు, సాయంత్రం రెండు చొప్పున వరుసగా 21 రోజుల పాటు తీసుకోవడం వల్ల మలం స్మూత్ గా అయ్యి.. మల బద్ధకం తగ్గుతుంది. పేగులలో కదలికలు కూడా బాగా జరుగుతున్నాయని నిరూపించబడింది. కన్ని ఫ్రూట్స్ లో ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని ఫ్రూట్స్ లో ఉండకపోవచ్చు. అందు వల్ల అందుబాటులో ఉన్నప్పుడు ఇలాంటి ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. సిటీలో ఉన్న వారికే బాగా అందుబాటులో ఉంటున్నాయి. కివీ ఫ్రూట్స్ దొరికినప్పుడు కనుక్కొని ఫ్రిడ్జిలో పెట్టుకోవడం వల్ల తొక్క దళసరిగా ఉండటం వల్ల రెండు మూడ్రోజులు ఫ్రిజ్ లో ఉన్నా సరే పోషకాలు పోవు. కివీ ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నప్పుడు రోజుకు మూడు సార్లు రెండు చొప్పున తీసుకోవడం వల్ల మల బద్ధకం, పేగుల్లో కదలికలు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.