Health Benefits : బిళ్ళ గన్నేరు మొక్కను పెంచుతున్నారా… అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే!
Health Benefits : బిళ్ల గన్నేరు మొక్కలు ఎక్కడ పడితే అక్కడే పెరుగుతుంటాయి. దీన్ని సంస్కృతంలో నిత్య కళ్యాణి, నిత్య పుష్పి అని అంటారు. ఇవి ఎరుపు, తెలుపు రంగుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. చాలా మంది దీన్ని అందానికి మాత్రమే పెంచుకుంటారు. అయితే బిళ్ళ గన్నేరు మొక్క అనేక ఆయుర్వేద చికిత్సలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది. దీనిలో అనేక ఒషధ గుణాలను కల్గి ఉంది. దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే అనేక రోగాలకు ఇంటి నివారణ చిట్కాగా పని చేస్తుంది. బిళ్ళ గన్నేరు అందరికీ అందుబాటులో ఉండే ఒక మూలిక. ఈ మొక్క పువ్వులు, ఆకులు, వేర్లను అన్నింటిని ఒషధ తయారీకి ఉపయోగిస్తారు. దీని శాస్త్రీయ నానం పెరివింకిల్. బిళ్ళ గన్నేరు మొక్క మెదడు ఆరోగ్యం కోసం ఉపయోగించబడుతుంది.
మెదడులో రక్ ప్రసరణను పెంచడం, మెదడు ఆరోగ్యం కోసం ఉపయోగించబడుతుంది. మెదడులో రక్త ప్రసరణను పెంచడం, మెదడు జీవ క్రియకు మద్దతు ఇవ్వడం, మానసిక ఉత్పాదకతను పెంచడం, జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత సమస్యలు మరియు బలహీనతను నివారించడం, ఆలోచనా సామర్థ్యాన్ని మెరుగు పరచడం మరియు మెదడు కణాల ప్రారంభ వృద్ధాప్యాన్ని నివారించడం వంటి అనేక చికిత్సలకు దీన్ని ఉపయోగిస్తారు.బిళ్ళ గన్నేరు విరేచనాలు, యోని సమస్యలు, గొంతు వ్యాధులు, టాన్సిల్స్లిటిస్, ఛాతి నొప్పి, అధిక రక్తపోటు, గొంతు నొప్పి, ప్రేగు నొప్పి మరియు వాపు, పంటి నొప్పి మరియు నీరు నిలుపుదల చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. ఇది గాయం నయం చేయడాన్ని ప్రోత్సహించడానికి రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని రక్షించే విధానాన్ని మెరుగు పరచడానికి మరియు రక్త-శుద్ధీకరణ కోసం కూడా ఉపయోగించబడుతుంది.

amazing Health Benefits of Madagascar Periwinkle
ఈ మొక్క ఆకులను శుభ్రంగా కడిగి దంచి రసం తీసి ఉదయాన్నే ఒక స్పూన్ తాగడం వల్ల అధిక రక్తపోటును తగ్గిస్తుంది. స్త్రీలకు రుతు క్రమంలో వచ్చే అనేక సమస్యలకు ఈ ఆకులను కషాయంగా మరిగించి తాగడం వల్ల అధిక రక్త స్రావం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకలను పేస్టు చేసి గాయాలు తగిలిన చోట రాయడం వల్ల యాంటీ సెప్టిక్ క్రీములా పని చేస్తుంది. నోటి సమస్యలు, అల్సర్లు ఉన్నప్పుడు ఈ ఆకులను దానిమ్మ మొగ్గలు, పువ్వులను విడివిడిగా దంచి ఈ రసాలను నోటిలో పుక్కిలించడం వల్ల అల్సర్లు తగ్గుతాయి. నోటి దుర్వాసన, పంటి నొప్పి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇవే కాకుండా చెవిపోటు, చర్మ సమస్యలు, కిడ్నీ సమస్యలు, డిప్రెషన్, నిద్రలేమి వంటి సమస్యలు నివారణకు కూడా ఈ మొక్క చాలా బాగా పని చేస్తుంది.