Health Benefits : అద్భుతమైన అడవి దోసకాయల గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Health Benefits : అడవి దోసకాయను నూగు దోస లేదా ముగుముగు దోసకాయ అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ మొక్కలో అనేక ఆయుర్వేద ప్రయోజలనాలు ఉంటాయి. ఈ మొక్కను ప్రాంతాన్ని బట్టి ఒక్కో విధంగా పిలుస్తారు. ఈ దోస మన దేశంలో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అడవి దోసకాయను పరీక్షించిన పరిశోధకులు… వీటిని సాంప్రదాయ వైద్య నివారణిగా వాడారు. ఈ మొక్కలను సిద్ధ వైద్యంలో, సాంప్రదాయ యునాని, ఆయుర్వేద, హోమియోపతి, యూరోపతి అలాగే చైనా వైద్యంలో కూడా ఉపయోగించారు. ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు కూడా. అయితే ఈ మొక్క కుకుర్బెటిసి కుటుంబానికి చెందింది. ఇంతకు ముందు పిల్లలు ఇవి కనిపిస్తే చాలు తెంపుకొని తినే వారు.
చేదుగా ఉండే ఈ కాయలు అచ్చం దోసకాయల లాగానే కనిపిస్తాయి.ఈ అడవి దోసకాయల వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు, ఆందోళన, పిత్తం, అజీర్తి, ఆకలి లేకపోడం, యసిడ్స్ పొట్టలో పైకి తన్నడం, పంటి నొప్పి, ఉబ్బసం, పొడి దగ్గు, రక్తపోటు మరియు మధుమేహం చికిత్సలో కూడా చాలా ప్రభావవంతంగా ఉపయోగించబడుతుంది. ఇది నొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నూగు దోస ముసుముసుక్కైగా తనిళనాడులోని ప్రసిద్ధ మూలికల్లో ఒకటిగా ప్రాముఖ్యం పొందింది. బలహీనమైన కఫ మరియు పిత్త వ్యాధులకు చికిత్స చేసేందుకున్న దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే అడవి దోసకాయలు టినోస్పోరిడిన్, కొలంబిన్, బీటా-సటోస్టెరాల్ పుష్కలంగా ఉంటాయి.

amazing health benifits of adavi dosakaya
అితే ఇది మూత్ర సమస్యలతో బాధపడే వారికి ఒక మంచి మూత్ర విసర్జన కారి. కడుపు సంబంధ సమస్యలు, యూంటీపైరెటిక్, యాంటీ ఫ్లాటులెంట్, యాంటీ ఆస్మాటిక్, యాంటీ బ్రోన్త్కెటిస్ తో పాటుగా వెర్టిగో మరియు పిత్తాశయం వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.అలాగే దీన్ని పంటి నొప్పి లేదా అపాన వాయువు నుండి ఉపశమనం వంటి వివిధ చికిత్సా ప్రయోజనాలు కోసం నివారణిగి ఉపయోగిస్తారు. కొంత మంది సాంప్రదాయ వైద్యులు కామెర్ల నివారణకు కూడా ఈ మొక్క ఆకుల కషాయాన్ని ఉపయోగిస్తారు. అలాగే ఈ ఆకుల కషాయాలకు రక్తపోటు చికిత్స కోసం కూడా వినియోగిస్తుంటారు. అలాగే నూగు దోస, ముగుముగు దోస, అడవి దోస.. రక్తపోటును తగ్గిస్తుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.