Health Benefits : విరిగిన ఎముకలను అతికించడమే కాదండోయ్.. దగ్గు, జలుబును కూడా తగ్గిస్తాయి!
Health Benefits : పల్లెలు, గ్రామాల్లో ఉండే వారికి నల్లేరు మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి తెలిసే అవకాశం చాలా తక్కువ. ఈ మొక్కను చూడడానికి ఎడారి మొక్కలా కనిపిస్తుంది. అలాగే తాడి చెట్ల వంటి పెద్ద చెట్ల పక్కన అల్లుకొని కూడా ఉంటుంది. ఈ మొక్కను ఆషాఢం సమయంలో పచ్చడి చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. అంతే కాకుండా ఈ మొక్కలు ఎముకలు విరిగిన వారికి పుత్తూరులో పిండికట్టు కట్టించుకోవడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ కాడలు ఆహారంలో తీసుకోవడం వల్ల బలహీన పడిన, పెలుసు ఎముకలను తిరిగి ఆరోగ్యంగా చేస్తుందని చెబుతారు. దీని శాస్త్రీయ నామం సిస్సస్ క్వడ్రాన్గలరీస్.
భారత దేశంలో సంప్రదాయ పద్ధతుల్లో నల్లేరు శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. ఇది నొప్పి నివారణిగా విరిగిన ఎముకలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. నిజానికి దాని అనేక పేర్లలో ఒకటి అస్థి సంహారక. ఇది ఎముకల నాశనాన్ని నిరోధించేది అని అర్థం వస్తుంది. ఈ మొక్కను సులభంగా ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్క కాడల ద్వారా కొత్త మొక్కలను తయారు చేసుకోవచ్చు. దీనికి కొద్దిపాటి తడి ఉంటే చాలు సులువుగా పెరుగుతుంది. ఈ మొక్కలను మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే ఈ మొక్కను వండుకునేటప్పుడు దాని పైన ఉండే పొర తీసేసి వేడి నీటిలో కానీ మజ్జిగలో నానబెట్టి తర్వాత వండుకోవాలి.
లేదంటే ఇందులో ఉండే కొన్ని రసాయనాల వల్ల దురద వచ్చే అవకాశం ఉంది. ఈ కాడలను లేతగా ఉన్నప్పుడు తీసుకొని పచ్చడిగా మరియు రొట్టెల పిండి వంటి వాటిలో దంచి పేస్టుగా చేసి కలుపుతుంటారు. ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించడంలో సహాయపడుతుంది.ఇది హేమారాయిడ్స్, గౌట్, ఆస్తమా, అలెర్జీలతో హా అనేక పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది. అయితే ఈ పవర్ ప్యాక్డ్ ప్లాంట్ ముకల ఆరోగ్యాన్ని పెంపొందించడం కీళ్ల నొప్పున నుండి ఉపశమనం పొందడం మరియు గుండె జబ్బులు, మధుమేహం మరియు స్ట్రోక్ వంటి దర్ఘ కాలిక పరిస్థితుల రోగాల నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుందని ఇటీవలి పరిశోధనలో కనుగొనబడింది.