Hair Tips : ఉల్లిరసంలో ఈ పేస్ట్ కలిపి రాస్తే… జుట్టు వద్దన్నా పొడవుగా పెరుగుతుంది.. మీరే చూడండి!
Hair Tips : ప్రస్తుతం అందరికీ ఉన్న పని, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారింది. దీని కోసం రకరకాల షాంపూలు, నూనెలు, హెయిర్ డైలు, స్ప్రేలను ఉపయోగిస్తుంటారు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ ఇలాంటి ప్రయజనం ఉండదు. ఇంట్లో ఉండే వాటితో నాచురల్ పద్ధతిలో ఆయిల్ హెయిర్ ప్యాక్ వంటివి ట్రై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. వీటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. వీటిని ఉపయోగించడం వల్ల ఫలితం కూడా బాగుంటుంది. ఇప్పుడు జుట్టు రాలడం తగ్గించే అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం. దీని కోసం ముందుగా మనం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
క స్తైనర్ సాయంతో జ్యూస్ ను వడకట్టుకోవాలి. ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒఖ గుప్పెడు మెంతులు రాత్రి నానబెట్టి పట్టుకోవాలి. ఆ మెంతులను నానబెట్టి ఆ నీటోతో సహా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్ట్తరైనర్ సాయంతో మెత్తటి పేస్టును సెపరేట్ చేస్కోవాలి. ఆనియన్ జ్యూస్ లో మెంతుల పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఆరిన తర్వాత దైనా షాంపూతో వాష్ చేస్కోవాలి. ఇలా వారానికి ఒఖ సారి చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఒకసారి ఉపయోగించే సరికి తేడా మీరే గమనిస్తారు. ఉల్లిగడ్డ జ్యూస్ జుట్టు రాలడాన్ని తగ్గించి కొత్త వెంట్రుకలు రావడానికి ఉపయోగపడుతుంది.

amazing home remedy for hair growth and thickness for black hair
అలాగే తలలో ఉండే ఇన్ఫెక్షన్, చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే పేను కొరుకుడు సమస్యతో బాధపడే వారు ఉల్లిగడ్డ జ్యూస్ అప్లై చేయడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది. అలాగే తలలో ఉండే వేడిని, ఒత్తిడిని మెంతులు తగ్గిస్తాయి. ఇలా తరచుగా చేయడం వల్ల జుట్టు మృదువుగా, ధృఢంగా, ఒత్తుగా తయారవుతుంది. మైల్డ్ షాంపూ లేనప్పుడు కుంకుడ కాయ, శీకాకయ వంటివి కూడా ఉపయోగించ వచ్చు డ్రై హెయిర్ ఉన్న వాళ్లు అయితే ఈ పేస్టులో రెండు చెంచాల క్యాస్టర్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వేసి కలుపుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.