Beauty Tips : ముఖంపై మచ్చలు తగ్గించే ఈ మడ్ ప్యాక్ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిందే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beauty Tips : ముఖంపై మచ్చలు తగ్గించే ఈ మడ్ ప్యాక్ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!

 Authored By pavan | The Telugu News | Updated on :3 June 2022,4:00 pm

Beauty Tips : చాలా మందికి ముఖంపై మచ్చలు ఏర్పడి చూడటానికి అంద వికారంగా కనిపిస్తుంటారు. అయితే అవన్నిటినీ పోగొట్టుకొని మొహాన్ని అందంగా, కాంతి వంతంగా తయారు చేసుకోవాలనుకుంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. బ్యూటీ పార్లర్లు, ఆసుపత్రుల చుట్టూ తిరగడం… రకరకాల ట్రీట్ మెంట్స్ తీస్కోవడం వంటివి చేస్తుండాలి. అంతే కాకుండా అనేక రకాల క్రీముల వాడాలి. కానీ వీటి వల్ల ఫలితాల కంటే నష్టాలే ఎక్కువ అని చెప్పొచ్చు. భవిష్యత్తులో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీటన్నిటికి బదులుగా… ఇంట్లోనే ఈ మడ్ ప్యాక్ తయారు చేసుకొని మొహానికి వెస్కున్నారంటే… అతి తక్కువ కాలంలోనే అందంగా తయారవొచ్చు. అయితే ఈ మడ్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మడ్ ప్యాక్ కోసం నల్ల మట్టి ఒక్కటి ఉంటే సరిపోతుంది. నగరాలు, పట్టణాల్లో ఉండే వాళ్లు ఊళ్ల నుండి ఈ నల్లమట్టని తెప్పించుకొని సుత్తి లేదా బండతో బాగా కొట్టుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. తర్వాత దానిలో ఉండే వేర్లు పుల్లలు లాంటివి తీసేసి శుభ్రం చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒకసారి మళ్లీ మెత్తగా మిక్సీ పట్టుకొని ఒకసారి జల్లెడ పట్టుకోవాలి. మెత్తగా అంటే బియ్యప్పిండి లాగా ఉండేలా చూస్కోవాలి. జల్లించిన మట్టిని మరొకసారి ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టడం వల్ల దానిలో ఏమైనా క్రిములు ఉంటే చచ్చిపోతాయి. ఎండ బెట్టిన మట్టిని ఏదైనా జిప్ లాక్ బ్యాగ్ లో లేదా ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. మీ ముఖానికి సరిపడినంత ఒక గిన్నెలో తీస్కొని కుండలోని చల్లని నీరు వేసి 3 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి.

amazing mud pack for fairy skin and reduce dark spots

amazing mud pack for fairy skin and reduce dark spots

మధ్యలో నీళ్లు వేయడం వల్ల దానిలో ఉండే పోషకాలు డెవలప్ అవుతాయి. బాగా నానిన మట్టిని ముఖంపై అర అంగుళం మందంలో కళ్లు, ముక్కు, పెదవుల దగ్గర వదిలేసి ముఖమంతా అప్లై చేసుకోవాలి. మట్టి నానబెట్టుకునేటప్పుడు నీళ్లు మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ముఖానికి అంటుకునే విధంగా కలుపుకోవాలి. 25 నుంచి 45 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ముఖం అంతా బిగుసుకున్నట్లు అవుతుంది. తర్వాత ముఖాన్ని రుద్దుతూ కడుక్కోవాలి. ఈ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల ముఖంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి. ముఖంపై ఉండే మలినాలు, వ్యర్థాలు కూడా తొలగిపోతాయి. మొటిమలకు కారణం అయ్యే వైరస్ ను కూడా నాశనం చేస్తుంది. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై ఉండే నల్లని మచ్చలు పోయి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది