Beauty Tips : కాళ్ల పగుళ్లతో తెగ ఇబ్బంది పడిపోతున్నారా.. అయితే ఒక్కసారి ఇది రాయాల్సిందే!
Beauty Tips : పాదాల పగుళ్ల సమస్య ఉన్న వారు పడే బాధ అంతా ఇంతా కాదు. నీళ్లలో నడవలేరు.. అలాగని ఎండలోనూ నడవలేరు. చెప్పులు లేనిదే అడుగు బయట పెట్టిన నొప్పితో విలవిల్లాడిపోతారు. అయితే పాదాల పగుళ్లకు ముఖ్య కారణం… పాదాలపై సరిగ్గా శ్రద్ధ తీసుకోకపోవడం, తేమను కోల్పోవడం, చర్మంలోని పగుళ్లకు దుమ్ము, ధూళి చేరడం. అయితే వీటిని చూడటానికి ఇబ్బందిగా ఫీలవ్వడమే కాకుండా… నడవడానికి కూడా నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎండా కాలంలో పాదాలపై కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని… ఒక వేళ తీసుకోకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
అలా అని డాక్టర్ల దగ్గరకెళ్లి క్రీములు వంటివి తెచ్చి రాయడం కంటే.. ఇప్పుడు చెప్పబోయే అద్భతమైన చిట్కాను ఉపయోగించి పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు. అయితే ఆ చిట్కా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గిన్నెలో అర టీ స్పూన్ పసుపు, అర స్పూన్ కర్పూరం పొడి, అర స్పూన్ నెయ్యి కలుపుకోవాలి. ఈ మూడింటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒఖ బకెట్లో గోరు వెచ్చని నీటిని వేసి అందులో ఒఖ షాంపూ వేయాలి. అర చెక్క నిమ్మరసం పిండి పాదాలను అందులో ఒక పది నిమషాల పాటు నాననివ్వాలి. తర్వాత ఇంట్లో ఫ్యూమిక్ స్టోన్ తో పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. దీని వల్ల పాదాలపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. తర్వాత శుభ్రంగా తుడిచి తయారు చేసుకున్న కర్పూరం నెయ్యి పసుసు మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేయాలి.
ఇది వేటికి అంటుకోకుండా ఉండడానికి సాక్సులు వేసుకోవాలి. ఇలా రాత్రంతా ఉంచి మరుసటి రోజు శుభ్ర పరుచుకోచ్చు. ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయి. ఇందులో వాడే పసుపు వల్ల నొప్పి, వాపు తగ్గిపోతుంది. కర్పూరం కూడా నొప్పిని తగ్గించడంలోనూ, ఇన్ ఫెక్షన్ ని తగ్గించడానికి సాయపడుతుంది. నెయ్యి తేమను అందించి పాదాల పగుళ్లు తగ్గిస్తుంది. ఈ చిట్కాను కనీసం రెండు మూడు రోజుల పాటు ప్రయత్నించి ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. తర్వాత చిట్కా కోసం కొబ్బరి నూనె తీసుకోవాలి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. కానీ ఒఖ గిన్నెలో స్పూన్ కొబ్బరి నూనె వేసుకొని దానిలో ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి.