Hair Tips : ఈ చిన్ని చిట్కాతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.. ఎలాగో తెలుసా?
Hair Tips : ఈ మధ్య చాలా మందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుంది. పాతికేళ్ల వయసులోనే వయసు మీద పడ్డట్టుగా తెల్ల జుట్టు కనిపిస్తూ… తెగ ఇబ్బంది పెట్టేస్తుంది. అయితే దీన్ని తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాల షాంపూలు, హెయిర్ కలర్స్, నూనెలు, హెయిర్ డైలు, స్ర్పేలు వాడుతుంటారు. అయితే ఇందులో ఉండే రసాయనాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇవి చర్మ క్యాన్సర్లు, ఎలర్జీలకు, దురదలకు, చర్మం ఎర్రగా మారడానికి కారణం అవుతాయి. అందుకే వీటకి బదులుగా ఆయుర్వేదం ప్రకారం ఒక చిట్కా తయారు చేసుకొని వాడడం వల్ల కొన్ని రోజుల్లోనే జుట్టు నల్లగా తయారవుతుంది. తెల్ల జుట్టు సమస్య శాశ్వతంగా నివారించబడుతుంది.
అందుకోసం మనం ఒక గిన్నెలో గ్లాస్ నీటిని వేసుకోవాలి. అందులో గుప్పెడు కరివేపాకు, నాలుగు పచ్చి ఉసిరికాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని మరిగించి కరివేపాకు, ఉసిరి ముక్కలు బాగా ఉడకి వాటిలోని గుణాలు నీటిలోకి వచ్చేంత వరకు మరిగించాలి. తర్వాత ఈ నీటిని ఒఖ గిన్నెలోకి వడకట్టుకోవాలి. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను కాపాడుతాయి. ఫ్రీ రాడికల్స్ ని ఎదుర్కొని జుట్టు రాలడాన్ని ఆపుతుంది. ఉసిరి జుట్టు దృఢఁగా పెరిగేందుకు, హెయిర్ కుదుళ్ల బలంగా అయ్యేందుకు సహాయ పడి హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది. జుట్టు తెల్ల బడకుండా ఆపుతుంది.
అలాగే ఈ నీటిలో హెన్నా పౌడర్ వేసుకోవాలి. జుట్టుకు చల్లదనాన్ని ఇవ్వడంతో పాుటు చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్యలను తగ్గిస్తుంది. హెన్నా పౌడర్ లో ఒక స్పూన్ కాఫీ పౌడర్ కూడా వేయాలి. కాఫీ పౌడర్ జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహాయ పడి జుట్టు నల్లగా మారేందుకు సహాయ పడుతుంది. వీటన్నింటిని వేి బాగా కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఒఖ గంట తర్వాత తలస్నానం చేయవచ్చు. ఇలా ఒక రోజు చేసి ఆపేయకుండా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యంగా మారుతుంది ముఖ్యంగా చుండ్రు తగ్గితే జుట్టు సమస్యలు 90 శాతం తగ్గినట్టే. ఈ ప్యాక్ చుండ్రును అరికట్టడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.