Beauty Tips : పులిపిర్లు పోవాలంటే… ఒకసారి ఇది రాసి చూడండి…
Beauty Tips : కొంతమందికి శరీరం పైన ఎక్కడ పడితే అక్కడ పులిపిర్లు వస్తూ ఉంటాయి. ఇలా పులిపిర్లు ఉండటం వలన బయటికి వెళ్లాలంటే కొందరు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటివారు వీటిని పోగొట్టుకోవడం కోసం వాటిని కాల్చడం లేదా కత్తిరించడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ అలాంటివి అస్సలు చేయకూడదు. అలా చేయడం వలన చర్మం దెబ్బతింటుంది. పులిపిర్లు రావడానికి ఒక వైరస్ కారణం. ఆ వైరస్ చనిపోయేటట్లు చేస్తే పులిపిర్లు పోతాయి. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు డైరెక్ట్ గా చర్మంపై పడడం వలన కూడా పులిపిర్లు వస్తాయి. అయితే వీటిని తొలగించడానికి ఈ చిట్కాను ఫాలో అవ్వండి. దీన్ని ఒక్కసారి రాస్తే జన్మలో మళ్ళీ రావు.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ముందుగా నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని మెత్తగా దంచుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బల నుండి రసం వడకట్టుకోవాలి. తర్వాత దీనిలో ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్న తర్వాత అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలిపి చర్మంపై ఎక్కడ పులిపిర్లు ఉన్నాయో అక్కడ కాటన్ తో లేదా ఏదైనా చిన్న క్లాత్ ముక్కతో మిశ్రమాన్ని పులిపిర్ల మీద మాత్రమే అంటుకునేలాగా అంటించాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకోవాలి. ఇలా వరుసగా నాలుగు రోజులపాటు అప్లై చేస్తే పులిపిర్లు పోతాయి.
చర్మం లో పులిపిర్లు రావడానికి కారణమైన వైరస్ ఈజీగా చచ్చిపోతుంది. ఎటువంటి నొప్పి, బాధ, చర్మం డ్యామేజ్ అవ్వడం వంటివి ఉండవు. శరీరంపై ఎక్కడపడితే అక్కడ వచ్చే పులిపిర్లను ఈ చిట్కాతో సులువుగా పోగొట్టుకోవచ్చు. పులిపిర్ల సమస్యతో బాధపడుతున్న వారు ఈ చిట్కాను ఒకసారి ట్రై చేశారంటే మంచి ఫలితం ఉంటుంది. ఒకసారి ఉపయోగించి చూస్తే ఫలితం మీకే కనిపిస్తుంది. పులిపిర్లను తగ్గించడం కోసం మిశ్రమంలో ఎటువంటి కెమికల్స్ ఉన్న పదార్థాలు లేవు కాబట్టి దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి అన్ని వయసుల వారు ఈ చిట్కాను ఉపయోగించవచ్చు.