Custard Apple : సీతాఫలం తింటే బరువు పెరుగుతారా.? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..!!
ప్రధానాంశాలు:
Custard Apple : సీతాఫలం తింటే బరువు పెరుగుతారా.? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..!!
Custard Apple : సీతాఫలం తింటే బరువు పెరుగుతారా.? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. సీతాఫలం అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సీతాఫలంలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ సీతాఫలంలో ప్రోటీన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. సీతాఫలం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శరీరానికి చలవ చేయడంతో పాటు రక్తహీనత సమస్య నుంచి కూడా రక్షిస్తుంది. ఇందులో ఉండే కాపర్ మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణం ఇవ్వడానికి సహాయపడతాయి. కొంతమందికి సీతాఫలం గురించి కొన్ని అపోహలు ఉంటాయి.
సీతాఫలం తింటే బరువు పెరుగుతారని అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే. సీతాఫలంలో కొవ్వులు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావన కలిగేలా చేస్తుంది. తద్వారా ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉండి క్రమంగా బరువు తగ్గొచ్చు.. సీతాఫలంలో ఉండే విటమిన్ b6 ఎసిడిటీ, కడుపుబ్బరం, అల్సర్లు వంటి సమస్య నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.పి సి ఓ ఎస్ ఉన్నవారిలో హార్మమన్ల మార్పు వలన అలసట, నీరసం, చికాకు వంటి సమస్యలు ఎదురవుతాయి..
సీతాఫలంలో ఏదైనా అధికంగా ఉంటుంది. పి సి ఓ ఎస్ ఉన్నవారు సీతాఫలం తింటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఈ పండులోని ఫైబర్ గర్భిణీలలో మలబద్ధకాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆక్సిడెంట్లు వాంతులు ,వికారం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. శరీరంలో మెగ్నీషియం లోపిస్తే గుండె పై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి మెగ్నీషియం నిండి ఉన్న శీతాకాలం ఆ సమస్యలను తగ్గిస్తుంది. ఈ పండులో ఉండే ఇతర కణజాలు విటమిన్ సి రక్తప్రసరణను మెరుగుపరిచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. షుగర్ పేషెంట్లు సీతాఫలం తినడానికి సందేహిస్తూ ఉంటారు. సీతాఫలంలో ఇండెక్స్ తక్కువగా ఉండడంతో షుగర్ ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా సీతాఫలాన్ని తినవచ్చు నిపుణులు చెప్తున్నారు..