Health Benefits : కాలి బొటన వేళ్లపై వెంట్రుకలు వస్తున్నాయా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!!
Health Benefits : జుట్టు అనేది శరీరంలో చాలా చోట్ల వస్తుంది. ఎక్కువగా గమనించేది మాత్రం తలపై అలాగే ముఖంపై కనుబొమ్మలు, కను రెప్పలకు వెంట్రుకలు వస్తాయి. మగవారిలో అయితే గడ్డం, మీసం రూపంలో జుట్టు వస్తుంది. అలాగే జననేంద్రీయ ప్రాంతాల్లో హెయిర్ వస్తుంది. అలాగే కాళ్లపై, చేతులపై సన్నని జుట్టు వస్తూనే ఉంటుంది. అయితే కొద్ది మందిలో కాలి బొటన వేళ్లపైనా హెయిర్ వస్తుంది. ఒకసారి పరిశీలనగా చూస్తే వెంట్రుకలు కనిపిస్తాయి.ఒక వేళ కాలి బొటన వేళ్లపై జుట్టు రాకపోతే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయట. కాలి వెంట్రుకలను గుండె జబ్బుకు సంబంధి ఏమిటా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే. కొంత మందికి కాలి బొటన వేలులో వెంట్రుకలు పెరగవు.
ఎందుకంటే రక్తం నుంచి పోషకాలు సరిగా అందవు.అలా అందకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే రక్తాన్ని సరఫరా చేసే నాళాలైన ధమనుల్లో ఆటంకం ఏర్పడడమే. సాధారణంగా మనం తినే ఆహారం ద్వారా మన శరీరంలో ఎంతో కొంత కొవ్వు పేరుకుపోతుంది. అలా ధమనుల్లో మొత్తంలో పేరుకుపోయే కొవ్వు ముందుగా చేరేది ధమనుల్లోనే. ఈ క్రమంలో ధమనుల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల రక్తం సరఫరా సరిగ్గా జరగదు. దీంతో పోషకాలు కూడా సరిగ్గా అందక వెంట్రుకలు పెరగవు. కాలి బొటన వేలిపై వెంట్రుకలను పెరగకపోతే గుండె జబ్బులు వస్తాయని వైద్యులు అంటారు.తల, చేతులపై వెంట్రుకలు వచ్చినా రాకపోయినా వాటిని గుండె జబ్బులకు కారణంగా తీసుకోకూడదు. కాలి బటన వేలినే ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి అంటే.. కాలి బొటన వేలినే లెక్కలోకి తీసుకోవాలి. ఎందుకంటే తల, చేతులు గుండెకు చాలా దగ్గరగా ఉంటాయి.

do you have hair in foot thumb finger
కాబట్టి గుండె నుంచి వచ్చే ప్రెషర్ తో రక్తం ఎలాగో వాటికి అందుతుంది. అందుకే వాటిని పరిగణనలోకి తీసుకోవద్దు.కానీ కాలు గుండెకు బాగా దూరంగా ఉంటుంది. కాబట్టి అక్కడి వరకు రక్తం సరఫరా కావాలంటే మామూలుగానే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే కాలి బొటన వేలిని లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచు కోవాల్సి ఉంటుంది. అదేమిటంటే కాలి బొటన వేలిపై ఉన్న వెంట్రుకలు బాగా పెరిగితే అక్కడ రక్తం సరఫరా సక్రంగా జరుగుతున్నట్లే భావించాలి.రక్త సరఫరా తలపై నుండి అరి కాలి వరకూ సక్రమంగా జరిగితే ఆరోగ్యంగా ఉన్నట్లు.అదే ఆ భాగంలో వెంట్రుకలు లేకపోతే రక్త ప్రసరణ సరిగ్గా కావడం లేదని అర్థం చేసుకోవాలి. దీంతో వారికి గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తి అవకాశాలు ఉంటాయని చెబుతారు.