మద్యం తాగితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో మీకు తెలుసా…!
చాలామంది ఆల్కహాల్ కి బానిసలు అవుతూ ఉంటారు.. అయితే ఈ మద్యం సేవించడం వలన కలిగే నష్టాలు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏలాంటివో మీకు తెలుసా.. ఈమధ్యం కారణంగా అనారోగ్య సమస్యలు సంభవిస్తున్నాయి. రోజు మద్యం తీసుకుంటే శరీరంలో 12 గంటల పాటు దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది.. అయితే దాన్ని ఈజీగా కొట్టిపారేయకూడదు.. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా కూడా ఆల్కహాల్ ని తీసుకోవడం మానుకోలేరు.. నిత్యం ఆల్కహాల్ తీసుకోవడం వలన ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.. నిద్రపై మద్యం ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసా.. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రోజంతా అలసటికీ దారితీస్తూ ఉంటుంది.
ఈ మద్యం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. దీని మూలంగా వ్యక్తి చావు అంచుల వరకు వెళ్లి వచ్చే అవకాశం ఉంటుంది. అధిక ఆల్కహాల్ తీసుకోవడం వలన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. క్రమేపి ఆల్కహాల్ సేవించిన వ్యక్తి చిరాకు పడుతూ ఉంటారు. అలాగే అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వలన మగవారిలో స్పెర్ము కౌంట్ కూడా పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. మద్యం లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. దాని ఫలితంగా బరువు పెరగడానికి దోహదపడుతుంది. బరువు పెరగడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. నిత్యం మద్యం సేవించడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మద్యం తీసుకోవడం వలన మెదడులో తెల్ల పదార్థం వచ్చే అవకాశం ఉంటుంది.
ఎక్కువ ఆల్కహాల్ రోగనిరోధక వ్యవస్థపై కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మద్యం నెమ్మదిగా శరీరాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఎక్కువగా నిద్రకి భంగం కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఈమధ్య ఎక్కువగా తీసుకోవడం వలన ఊబకాయం పెరిగిపోతూ ఉంటుంది. అలాగే లివర్ సమస్యలు కూడా సంభవిస్తాయి. మద్యం ఎక్కువగా సేవించడం వలన లివర్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది.ఇలా ఇంకా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.