Health Benefits : దీన్ని తింటే కంటి చూపు మెరుగవుతుంది.. ఎక్కడో ఉన్న వస్తువులూ స్పష్టంగా కనిపిస్తాయి!
Health Benefits : చిన్న వయస్సులోనే కళ్లద్దాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చాలా మందికి కళ్లద్దాలు ఉంటున్నాయి. ఏ కొందరికో మాత్రమే కళ్లద్దాలు లేకుండా చదవగలుగుతున్నారు. మొబైల్ ఫోన్ల వాడకం పెరగడం, కంప్యూటర్ స్క్రీన్ లను చాలా సేపటి వరకు అలాగే చూడటం, టీవీలు చూడటంతో వాటి ప్రభావం కళ్లపై పడుతోంది. స్క్రీన్ ల నుంచి వచ్చే బ్లూ లైట్ కంటిలోని రెటీనాను దెబ్బతీస్తోంది. దీని వల్ల కంటి చూపు మందగిస్తోంది. క్రమంగా సైట్ పెరుగుతోంది. దూరంలో ఉన్నవి లేదా దగ్గర్లో ఉన్నవి మాత్రమే చదవగలిగే సైట్ వచ్చేస్తోంది. ఈ సమస్య నుండి బయట పడాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.కంటి చూపు పెంచుకోవడానికి మనం తీసుకునే ఆహారంలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండాలి. బీటా-కెరోటిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్. ఇది ఉత్సాహంగా పని చేసేందుకు దోహద పడుతుంది.
విటమిన్-ఎ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్ కంటి ఉపరితలం లేదా కార్నియాను తేమగా మరియు ఆరోగ్యంగా ఉంచడం ద్వారా కంటి ఆరోగ్యానికి సహాయపడతాయి. క్యారెట్, మునగాకు, కరివేపాకులో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో విటమిన్ ఎ ఉత్పత్తి అవుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోనూ ఇవి చక్కగా పని చేస్తాయి. మరియు కంటి దృష్టిని మెరుగుపరచడానికి విటమిన్ ఎ కంటికి కాంతిని మెదడుకు పంపిన సిగ్నల్గా మార్చడంలో సహాయపడుతుంది. తక్కువ కాంతిలోనూ చూపు స్పష్టంగా ఉంటుంది. ఎలాంటి వస్తువులనైనా చూడగలుగుతారు. మెంతికూరలో కూడా బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. కరివేపాకు, క్యారెట్, మునగాకు కంటే కూడా మెంతికూరలో ఎక్కువ శాతం బీటా కెరోటిన్ ఉంటుంది.మెంతికూర రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, టెస్టోస్టెరాన్ ను పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
మరియు పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తిని పెంచడానికి సాయం చేస్తుంది.మెంతులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. మంటను తగ్గిస్తాయి మరియు ఆకలి నియంత్రణలో సహాయపడతాయి. మెంతి ఆకుల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కానీ కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. డైట్లో ఉన్నవారికి లేదా వారి క్యాలరీలను చూసే వారికి ఇది అనువైనది. ఇది కడుపు నిండినట్లు సంతృప్తికరంగా అనిపించడంతో పాటు… గుండెల్లో మంట, ఎసిడిటీ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. మెంతికూర యొక్క ప్రభావాలు యాంటాసిడ్ మందులతో సరిపోలాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీర్ణవ్యవస్థను కలిగి ఉండటానికి మెంతులు, మెంతికూర కూడా మీకు సహాయపడతాయి! మెంతికూరను ఆకుకూరగా పప్పులను కూరల్లోనూ వేసుకొని తినడం వలన ఈ ప్రయోజనాలను మీరు పొందవచ్చు.