Rains : వర్షాకాలంలో గోడలకు తేమ రాకుండా ఉండాలంటే… ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసా…!!
ప్రధానాంశాలు:
Rains : వర్షాకాలంలో గోడలకు తేమ రాకుండా ఉండాలంటే... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసా...!!
Rains : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే శనివారం రాత్రి నుండి ఎడతెరపి లేకుండా వర్షం అనేది కురుస్తుంది. దీంతో వాగులు మరియు వంకలు ఉగ్రరూపంతో ప్రవహిస్తున్నాయి. దీంతో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కురుస్తున్న ఈ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఇంటి నుండి అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇక వర్షాకాలం వచ్చింది అంటే చాలు ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదురవటం సర్వసాధారణం. అయితే వర్షాకాలంలో వచ్చే ప్రధాన సమస్యలలో గోడలకు తేమా రావడం కూడా ఒకటి. అయితే గోడలకు తేమ రావడానికి కారణం ఏంటి.? ఈ సమస్యకు ఎలా పులిస్టాప్ పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
గోడలకు తేమ అనేది రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది. ఇల్లు నిర్మించే టైంలో నాణ్యమైన సిమెంట్ ను ఉపయోగించకపోవడం. అలాగే బయట గోడలకు సరిగ్గా ప్లాస్టింగ్ చేయకపోవడం వలన కూడా గోడల్లో నుండి నీరు అనేది ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అలాగే ఇటుక విషయంలో కూడా నాణ్యత అనేది పాటించకపోయినట్లయితే ఇలాగే జరుగుతుంది. అంతేకాక నాణ్యత లేని ఇటుకను వాడినా కూడా గోడలకు తేమ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇంటిపై కప్పు నుండి కూడా నీరు కారుతుంటే మేడపైన నీరు అనేది ఎక్కువగా పేరుకుపోవడం వలన కూడా ఈ సమస్య అనేది వస్తుంది. మేడపైన నీరు అధికంగా ఉండిపోతే స్లాబ్ లోకి నీరు ఇంకి నీరు కారటం మొదలవుతుంది. ఇక కొన్ని సందర్భాలలో డ్రైనేజీ పైపుల్లో ఏర్పడే లీక్ ల కారణంగా కూడా గోడలలోకి తేమ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మరి గోడలకు తేమా అనేది రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. గోడలకు ఎక్కడ తేమ వస్తుందో అక్కడ వాటర్ లీక్ ప్రూఫ్ లిక్విడ్ ను వాడాలి. అలాగే ఈ లిక్విడ్ ను సిమెంట్ లో కలిపి గోడలకు అప్లై చేసినట్లయితే గోడకు తేమ అనేది రాకుండా ఉంటుంది. అలాగే మార్కెట్లో వాటర్ ప్రూఫ్ పెయింట్స్ కూడా దొరుకుతున్నాయి. కావున ఇవి నీళ్ల ను లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. ఇక గోడలపై ఎక్కడైనా పగుళ్లు వచ్చినా కూడా చూసుకుంటుంది. ఒకవేళ ఏదైనా పగులు వచ్చినట్లయితే వెంటనే వాటిని సిమెంట్ తో పూడ్చాలి. ఇక డ్రైనేజీ పైపులు ఎక్కడైనా లీక్ అవుతున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా వెంటనే వాటిని సరిచేసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలను పాటించటం వలన గోడలకు తేమ రాకుండా జాగ్రత్త పడవచ్చు…