Hair Tips : తెల్ల వెంట్రుకలను మాయం చేసి జుట్టుని నల్లగా నిగనిగలాడేలా చేసే చిట్కా.. మీకోసం!
Hair Tips : ప్రస్తుత కాలంలో జుట్టు రాలిపోవడం, పల్చగా ఉండటం మరియు వయసుకు మించి జుట్టు తెల్లబడడం వంటి వాటి నుంచి విడుదల పొందడానికి ఇప్పుడు మనం తయారు చేసుకునే రెమిడీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీన్ని ఉపయోగించడం ద్వారా జుట్టు పెరగడంతో పాటు చుండ్రు సమస్యలు, దురద, జుట్టు చివర్లు చిట్లిపోవడం వంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. అయితే ఈ చిట్కా ఏంటి దీన్ని ఎలా ఉపయోగించాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు గోరింటాకు తీస్కోవాలి. దీనికి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే మందారకులను కూడా తీస్కొని కడుక్కోవాలి. ఆ తర్వాత అలోవెరా, ఒక గుడ్డు వాడొచ్చు.
గుడ్డు ఇష్టం లేని వాళ్లు దాన్ని వాడకపోయినా పర్లేదు. తర్వాత బీట్ రూట్ తీస్కోవాలి. అలాగే పుల్లటి పెరుగు కూడా ఇందుకు అవసరం అవుతుంది. ఇప్పుడు మిక్సీజార్ లో గోరింటాకు, మందార ఆకు, ఎగ్ వైట్ వేస్కోవాలి. ఎగ్ వైట్ వద్దు అనుకునే వాళ్లు మెంతులు కూడా వేస్కోవచ్చు. తర్వాత పుల్లటి పెరుగు, కలబంద, బీట్ రూట్ ముక్కలు వేస్కొని.. ఒఖ చెక్క నిమ్మ రసాన్ని కూడా కలిపి మెత్తని పేస్టులా మక్సీ పట్టుకోవాలి. ఈ పేస్టులు ఫ్రిజ్ లో ఒక నెల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మన జుట్టుకు బాగా అప్లై చేసుకోవాలి. గంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్కోవాలి. ఇది హెయిర్ ఫాల్ తగ్గడానికి, చుండ్రు తగ్గడానికి మరియు దురద తగ్గడానికి సహాయ పడుతుంది.
ఇందులో మనం గోరింటాకు ఉపయోగించడం వల్ల ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ గ్రోత్ అనేది తగ్గడానికి సాయపడుతుంది. అలాగే జుట్టును కుదుళ్ల నుండి బలంగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో పెరుగు ఉపయోగించడం వల్ల చుండ్రు నుంచి మరియు దురద నుండి విముక్తి కల్గుతుంది. అలోవెరా హెయిర్ గ్రోథింగ్ కి మరియు జుట్టును షైనీగా మెత్తగా చేయడానికి చాలా బాగా సహాయ పడుతుంది. బీట్ రూట్ వల్ల జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి ట్రై చేయండి. రెండు మూడు సార్లు ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయగాన… మీకు మార్పు కనిపిస్తుంది.