Hair Tips : ఏం చేసినా జుట్టు పెరగట్లేదా… ఇదొక్కసారి ట్రై చేయండి.. వద్దన్నా పెరుగుతూనే ఉంటాయి!
Hair Tips : చాలా మందికి జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. జుట్టు రాలడం తగ్గి కొత్త జుట్టు రావడం కోసం రకరకాల షాంపూలు ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు. కెమికల్స్ కలిపిన షాంపూలు, నూనెలు, హెయిర్ స్ర్రేలు, డైలు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ చిట్కా ట్రై చేసినట్లయితే జుట్టు రాలడం తగ్గి కొత్త జుట్టు వస్తుంది. ఇప్పటి వరకూ చాలా ట్రై చేసి విసిగిపోయాం అనుకున్న వారు ఇది ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇది మీ ఇంట్లో ఉండే పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ఇది తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కలబంద, కాఫీ పౌడర్, టీ పొడి.దీనికోసం ముందుగా మీ జుట్టుకు సరిపడినంత కలబంద తీస్కొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కలబంద అంచులను కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్కోవాలి. ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసుకోవాలి. దీనిలో ఏ బ్రాండ్ అయినా ఒక చెంచా కాఫీ పొడిని వేస్కోవాలి. కాఫీ పొడి కలబంద జుట్టు సిల్కీగా తయారవడానికి సహాయ పడతాయి. అలాగే జుట్టు మృదువుగా శైనీగా అవ్వడంలో కూడా ఇవి బాగా ఉపయోగపడాతియ. తర్వాత దీనిలో ఒక చెంచా టీ పొడి కూడా వేస్కోవాలి. టీ పడి జుట్టు రాలడం తగ్గించి జుట్టు రాలిన చోట కొత్త వెంట్రుకలు రావడానికి సహాయ పడుతుంది. తర్వాత దానిలో ఒక చెంచా నీళ్లు వేస్కొని మిక్సీ పట్టుకోవాలి.

hair growth hair oil for all people
ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీస్కొని కాటన్ లేదా జుట్టు మొత్తం అప్లై చేస్కోవాలి.అప్లై చేసిన తర్వాత ఒక అర గంట సేపు అలా ఉండనివ్వాలి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు రాయడం వల్ల జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అంతే కాకుండా చుండ్రు దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టు రాలడం తగ్గి జుట్టు పట్టులా, మృదువుగా కూడా తయారవుతుంది. వీటిలో ఎలాంటి హానీ కల్గించే పదార్థాలు లేవు కాబట్టి జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఒత్తుగా, నల్లగా, పొడవుగా, బలంగా తయారవుతుంది.