Hair Tips : జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారా.. అయితే ఈ ట్రిక్ మీ కోసమే..
Hair Tips : ప్రస్తుతం వాతావరణంలో జరుగుతున్న మార్పులు మరియు ఆహారపు అలవాట్లు జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణాలుగా పేర్కొనబడుతున్నాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి నేటి జనం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తున్నారు . కానీ అందులో ఉండే కెమికల్స్ ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ దారితీస్తున్నాయి. అయితే ఈ సమస్యను నాచురల్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం…
ముందుగా ఒక బౌల్ ని తీసుకొని దానిలో రెండు విటమిన్ఇ, క్యాప్సిల్స్ వేసుకోవాలి .విటమిన్ఇ, జుట్టు రాలడం తగ్గించి కొత్త జుట్టు రావడాని కి తోడ్పడతాయి.తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆముదం వేసుకోవాలి.ఆముదం జుట్టు రాలడం తగ్గించి జుట్టు కుదుళ్లకు బలాన్ని చేకూరుస్తుంది.తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె ను కూడా కలపాలి.ఈ మూడింటిని బాగా కలిపి ఒక మిశ్రమంల తయారు చేసుకుని జుట్టు కుదుళ్ల వరకు అప్లై చేసుకోవాలి.ఇలా అప్లై చేసిన మిశ్రమాన్ని చేతి వేళ్లతో జుట్టు కుదులకు వెళ్లేలా ఒక 10 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి.
ఇలా మసాజ్ చేయడం వలన బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగి జుట్టు కుదురులకు బలం చేకూరుతుంది. అప్లై చేసిన మిశ్రమాన్ని అలా రెండు గంటలు ఉండనివ్వాలి. తర్వాత ఏదైనా న్యాచురల్ షాంపుతో తల స్నానం చేయాలి.ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు బలంగా పొడవుగా పెరుగుతుంది.