Hair Tips : దట్టమైన జుట్టు కోసం ఈ ప్యాక్ వేసుకుని చూడండి…
Hair Tips : ప్రస్తుతం ఉన్న జీవనశైలిలో చాలామంది జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రాలిపోవడం, చుండ్రు ,బట్టతల రావడం ఇలా రకరకాలుగా జుట్టు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికోసం ఎన్నో రకాల షాంపులను, ఆయిల్స్ ను వాడుతూ ఉంటారు. వాటి వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ జుట్టు సమస్యలను బారి నుండి ఉపశమనం కలగాలంటే… ఇంట్లోనే నేచురల్ గా ఈ పేస్ట్ ను తయారు చేద్దాం.. దీని తయారీ విధానం: గుప్పెడు మునగాకు తీసుకొని పక్కన పెట్టాలి ఈ మునగాకులు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ మునగాకు జుట్టులో వచ్చే ఇన్ఫెక్షన్ చుండ్రు జుట్టు రాలడం లాంటి సమస్యల నుండి రక్షిస్తుంది. అలాగే గుప్పెడు మందారపు ఆకులు ఇది జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గుప్పెడు తులసి ఆకులను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తలలో ఉండే ఇన్ఫెక్షన్, పొక్కులు ,సొరియాసిస్, చుండ్రు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.
అదేవిధంగా కలమంద ఈ కలమంద జుట్టుని స్మూత్ గా అదే విధంగా జుట్టు రాలడం తగ్గించి జుట్టు పొడవుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే గుంటగలరాకు, ఈ ఆకు జుట్టు నల్లగా మారడానికి, జుట్టు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకులో మెలనిన్ అనే ఒక పదార్థం విడుదల అయ్యి జుట్టు తెల్లగా అవ్వకుండా కాపాడుతుంది. అలాగే మెంతులు ఈ మెంతులను నాలుగు చెంచాలు తీసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఈ మెంతులు జుట్టు సిల్కీగా, పొడవుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే రెండు చెంచాల పెరుగు ఈ పెరుగు జుట్టుని స్మూత్ గా, సిల్కీగా హెయిర్ గ్రోథింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వేపాకు ఈ ఆకు తలలో ఉన్నటువంటి స్కాల్పు ,ఇన్ఫెక్షన్స్, చుండ్రు, దురద నుండి రక్షిస్తుంది.
మందార ఆకులు ఒక గుప్పెడు, వేపాకులు ఒక గుప్పెడు, నాలుగు చెంచాల మెంతులు, రెండు చెంచాల పెరుగు, ఒక గుప్పెడు తులసి ఆకులు, ఒక గుప్పెడు గుంటగలరాకు, ఒక మట్ట కలమంద , ఒక గుప్పెడు మునగాకు వీటన్నిటిని కలిపి మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టులో మనం రోజు వాడుకునే ఆయిల్ ను తీసుకొని ఒక స్పూన్ దాన్లో వేసి కలుపుకోవాలి. దీనిని జుట్టు కుదుర్ల నుంచి చివర్ల వరకు ప్యాక్ లాగా వేసుకుని 30 నిమిషాలు పాటు ఉండి తర్వాత కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేసినట్లయితే ఈ జుట్టు సమస్యలన్నీ మీకు దూరమవుతాయి.