Health Benefits : మీకు నరాల బలహీనత ఉందా.. ఇవి తింటే బలహీనత పోయి బలంగా అవుతాయి
Health Benefits : నరాల బలహీనత ఇబ్బంది పెడుతోందా. ఈ సమస్య ఉన్న వారు మనం ఊహించిన దాని కంటే ఎక్కువ మందే ఉంటారు. కానీ బయటకు చెప్పుకోరు. నరాల బలహీనత అనగానే అదేదో ఎయిడ్స్ వ్యాధి అన్నట్లుగా ఫీలై పోతుంటారు. నరాల బలహీనత ఉంటే ఇంక దేనికీ పనికి రామన్న భావన చాలా కాలం నుండి నాటుకుపోయింది. కానీ అది కూడా అన్ని అనారోగ్య సమస్యల్లాగే నయం చేయదగినదే. సరైన పద్ధతులతో ఆ సమస్యను కూడా […]
Health Benefits : నరాల బలహీనత ఇబ్బంది పెడుతోందా. ఈ సమస్య ఉన్న వారు మనం ఊహించిన దాని కంటే ఎక్కువ మందే ఉంటారు. కానీ బయటకు చెప్పుకోరు. నరాల బలహీనత అనగానే అదేదో ఎయిడ్స్ వ్యాధి అన్నట్లుగా ఫీలై పోతుంటారు. నరాల బలహీనత ఉంటే ఇంక దేనికీ పనికి రామన్న భావన చాలా కాలం నుండి నాటుకుపోయింది. కానీ అది కూడా అన్ని అనారోగ్య సమస్యల్లాగే నయం చేయదగినదే. సరైన పద్ధతులతో ఆ సమస్యను కూడా నయం చేసుకోవచ్చు. ఇందుకోసం పుట్టగొడుగులు చక్కగా పని చేస్తాయి. ఈ మధ్యకాలంలో పుట్టగొడుగుల వాడకం బాగా పెరిగి పోయింది. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే.. పుట్టగొడుగుల్లో ఉండే పోషక విలువలపై అవగాహన పెరగడమే.
మరే ఇతర శాఖాహారంలో లేని పోషకాలు పుట్టగొడుగుల్లో ఉంటాయి. వీటిలో బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది.పుట్టగొడుగుల్లో కూడా చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. మనకి ఎక్కువగా కనిపించే బటన్ మష్రూమ్స్, మిల్క్ మష్రూమ్స్ కంటే ఓయర్ పుట్ట గొడుగులు మాత్రం ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. అవి చూడడానికి ఆల్చిప్పల్లా ఉండి పెద్దగా తెరుచుకున్న పువ్వులా ఉంటాయి. వీటి ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఇంకా వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఓస్టెర్ పుట్టగొడుగులలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే పుట్ట గొడుగుల్లో కార్బోహైడ్రేట్లు తక్కువ మొత్తంలో ఉంటాయి.
పుట్టగొడుగులలో విటమిన్ డి మరియు సెలీనియంతో సహా చిన్న మొత్తంలో ఇతర సూక్ష్మపోషకాలు కూడా ఉంటాయి. ఓస్టెర్ పుట్టగొడుగులు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో సెల్యులార్ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.ఓస్టెర్ పుట్టగొడుగులు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అధిక కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటు వంటి సమస్యలను నివారిస్తాయి. గుండె జబ్బుల ప్రమాద కారకాలను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు, ఓస్టెర్ పుట్టగొడుగులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్న మరియు లేని 22 మందిలో చేసిన ఒక అధ్యయనంలో ఓయర్ పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల భోజనానంతర రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని కనుగొన్నారు.