Health Benefits : ఈ కాయ పొడిని తాగి చూడండి.. ఎంతటి తాగుబోతులైనా మద్యం మానేస్తారు!
Health Benefits : ప్రస్తుత కాలంలో చాలా మంది మద్యానికి బానిసవుతున్నారు. ఫుల్లుగా తాగొచ్చి ఇంటి వద్ద గొడవలు చేస్తూ… భార్యా పిల్లలలను కొట్టడం వంటివి చేస్తూ జీవితాన్ని నరకంగా మార్చుకుంటున్నారు. దీని వల్ల తాగుబోతులకే కాకుండా ఇంట్లో వారికి కూడా సమస్యే. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా అప్పులు తీసుకొచ్చి, ఇంట్లో బంగారం కుదువ పెట్టి మరీ తాగుడుకు బానిసలుగా మారుతున్నారు. ఇది ఎన్నో ఇళ్లల్లో ఉన్న సమస్య.తాగుడు మాన్పించేందుకు ఎన్నో రిహాబిలిటేషన్ సంస్థలు ఉన్నాయి. తాగుడుకు బానిసలుగా మారిన వారిని ఇందులో చికిత్స అందిస్తే నయం అవుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే కొందరు మాత్రం మరలా తాగుడు మొదలు పెడుతున్నారు.ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆ వ్యసనం నుండి బయట పడలేక పోతున్నారు.
కుటుంబాలను నాశనం చేస్తున్నారు. అయితే తాగుడు నుండి బయట పడేసేందుకు ఆయుర్వేదంలో ఓ చక్కని పరిష్కారం ఉంది. అది పాటిస్తే ఎవరైనా ఇట్టే తాగుడు మానేస్తారు.ఇందుకోసం కరక్కాయలు కావాల్సి ఉంటుంది. చిన్న సైజులో ఉండే కరక్కాయలను తీసుకోవాలి. పెద్దవి తీసుకుంటే అవి పాడై పోయే అవకాశం ఉంటుంది. దీని కోసం 3 కరక్కాయలను తీసుకోవాలి. వాటిని రోటిలో వేసుకుని పగల గోడితే అందులో తెల్లటి విత్తనం బయటకు వస్తుంది. దానిని తీసి వేసి కరక్కాయలను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఒక పావు టీ స్పూన్ ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. అందులో 10 టీ స్పూన్ల నీళ్లను వేసి బాగా కలుపుకోవాలి.కరక్కాయలతో తయారు చేసిన ఈ కషాయాన్ని రోజూ ఉదయం టిఫిన్ చేసిన 30 నిమషాల తర్వాత మద్యం సేవించే వారితో తాగించాలి. ఇలా క్రమం తప్పకుండా 60 రోజుల పాటు సేవిస్తే వారు మరో సారి మద్యం ముట్టరు.వీటిని రాత్రి సమయంలో కానీ పగటి వేళల తర్వాత కానీ ఎట్టిపరిస్థితుల్లో తీసుకోవద్దు. కరక్కాయ పొడి బయట ఆయుర్వేద షాపుల్లోనూ దొరుకుతుంది.
కానీ బయట దొరికే కరక్కాయ పొడి పూర్తి నాణ్యతతో ఉంటుందని చెప్పలేం. అందులో వేరే ఇతర పదార్థాలు కలిపే అవకాశం ఉంది. అందువల్ల కరక్కాయల పొడిని ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి.కరక్కాయ కషాయాన్ని 60 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఒక్క రోజూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఒక వేళ మధ్యలో ఆపితే దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కరక్కాయలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. మంచి ఔషధ గుణాలు కలిగిన పదార్థం కరక్కాయ. వీటిలో యాంట్రీ క్వినోన్లు, టానిన్లు, చెబ్యులిక్ ఆమ్లం, రెసిన్, స్థిర తైలాలను కలిగి ఉంటాయి. ఇవి అన్ని రకాల జీర్ణ కోశ వ్యాధులను నివారించడానికి సాయపడతాయి. ఆస్తమా, దగ్గు, వాంతులు, కంటి వ్యాధులు, గుండె సంబంధ వ్యాధుల నివారణకు సాయపడుతుంది.విపరీతమైన దగ్గు ఉన్న వారు కరక్కాయలను తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ కరక్కాయ ఎన్నో రకాల వ్యాధులను నివారించడంతో పాటు మద్యం వ్యసనం నుండి బయట పడేస్తుంది.