Health Benefits : కిడ్నీలో రాళ్లున్నాయా.. ఇది వాడితే మళ్లీ రమ్మన్నా రావు
Health Benefits : కిడ్నీలో రాళ్లు అనేది ఈ మధ్య పెద్ద సమస్యగా పరిగణించడం లేదు. ఎందుకంటే మారుతున్న జీవన ప్రమాణాలతో చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తోంది. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నాయంటే ప్రతి ఒక్కరూ చెప్పే మాట నీళ్లు ఎక్కువగా తాగాలని. అలాగే కొబ్బరి బొండాలు తరచూ తీసుకుంటూ ఉండాలని అంటారు. ఇది వాస్తవమే అయినప్పటికీ ఈ ఒక్కటే కిడ్నీలో రాళ్లను కరిగించడానికి సరిపోదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు చెప్పబోయేది పాటిస్తే కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి.గచ్చకాయలు చిన్నప్పుడు అందరూ చూసే ఉంటారు. వీటిని అరగదీసి చర్మంపై తాకిస్తే చురుక్కుమంటుంది. అలాగే ఆడపిల్లలు వీటితో గచ్చకాయ ఆట ఆడుకునేవారు.
అయితే వీటిని ఆభరణాల తయారీలోనూ ఉపయోగిస్తారన్నది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అలాగే వీటికి ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వీటిని ఫీవర్ నట్, బోండక్ నట్, గ్రే నిక్కర్, గ్రే నిక్కర్ బీన్, గిలండినా సీడ్, గచ్చకాయలు వంటి పేర్లతో కూడా పిలుస్తారు.గచ్చకాయలు జ్వరం, మలేరియా జ్వరాన్ని ఎదుర్కోవడంలో ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకులు, అలాగే కొమ్మలతో చేసిన పేస్ట వంటివి పంటి నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గచ్చకాయల ఆకులను నీటినలో ఉడకబెట్టిన ఆ కషాయాన్ని గొంతు నొప్పి నుండి ఉపశమనానికి పుక్కిలించడానికి వాడతారు. ఇది అధిక చెమటను నయం చేస్తుంది అలాగే శరీర దుర్వాసనను అరికడుతుంది.గచ్చికాయల రసం ఎలిఫెంటియాసిస్ ను తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది.
మశూచిని ఎదుర్కోవడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ను కంట్రోల్ ఉంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇది శరీరంలో ట్యూమర్ల పెరుగుదలను ఆపుతుంది. లివర్ సమస్యలకు ఇది మంచి హెర్బల్ రెమెడీ. ఇది ప్లీహము రుగ్మతలకు చెక్ పెడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు.పేగు పురుగులను ఎదుర్కొనేందుకు గచ్చికాయలు ఎంతో సమర్థంగా పనిచేస్తాయి. ఇది కోలిటిస్ అంటే పెద్ద పేగు యొక్క వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది కోలిక్ నొప్పిలో పరిస్థితిని సులభతరం చేస్తుంది. ఈ మొక్క యొక్క యాంటీ డైరియాల్ చర్య విరేచనాలు మరియు వదులుగా ఉండే పేగు కదలికలను నయం చేస్తుంది. అలాగే కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న వారికి వాటిని కరిగించి ఈ సమస్య నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది.