Health Benefits : పల్లిలు నానబెట్టి తింటే ఎన్నో ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకుందామా?
Health Benefits : బాదం పప్పును నానబెట్టి తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ వేరుశెనగ లేదా పల్లిలను నానబెట్టి తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..? నానబెట్టిన బాదంతో వచ్చే ప్రయోజనాలే నానబెట్టిన పల్లిలతోనూ వస్తాయి. చాలా మందికి ఇది ఆశ్చర్యం కలిగించినప్పటికీ ఇది నూటికి నూరు పాళ్లు నిజం. వేరు శెనగతో మరో ప్రయోజనం ఏమిటంటే… ఇది బాదం కంటే కూడా తక్కువ ధరకే లభించడం. కాబట్టి ప్రతి ఒక్కరూ పల్లీల వల్ల కలిగే లాభాలను తెలుసుకుని వాటిని తరచూ తీసుకుంటే పూర్తి ఆరోగ్యంగా ఉంటారు.వేరుశెనగలను నేరుగా తినడం కన్నా… నానబెట్టిన పల్లీలను తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, రాగి, ఐరన్, పొటాషియం, సెలీనియం, జింక్ అలాగే కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి అవయవాలు, ఆరోగ్యకరమైన ఎముకలు, చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన శక్తిని ఇస్తాయి.నాన బెట్టిన వేరు శెనగలు తినడం వల్ల కలిగి ప్రయోజనాల గురించి మెడికల్ న్యూస్ టుడేలో ఒక ఆర్టికల్ వచ్చింది. దాని ప్రకారం 25.8 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉన్న 100 గ్రాముల పల్లీలను తినడం వల్ల రోజూ వారీ తీసుకోవాల్సిన ప్రోటీన్ అవసరాల్లో సగం వరకు వేరు శెనగల నుండే పొందవచ్చని ఆ ఆర్టికల్ లో పరిశోధకులు పేర్కొన్నారు.నాన బెట్టిన వేరు శెనగ తొక్కలు రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. అలాగే గుండెను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పూర్తిగా నానిన పల్లీలు కండరాలు క్షీణించడాన్ని నివారిస్తుంది. అలాగే కండరాలను టోన్ చేయడానికి సాయపడుతుంది.
నానబెట్టిన పల్లీలను ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ సమస్యలతో పోరాడవచ్చు.ఇవి వెన్ను నొప్పి అలాగే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. చలికాలంలో, కీళ్లలో దృఢత్వం మరియు నొప్పిని ఎదుర్కోవడానికి బెల్లంతో పాటు నానబెట్టిన పల్లీలను తినాలి. పల్లీల్లో జ్ఞాపక శక్తిని మరియు కంటి చూపును మెరుగు పరిచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వేరు శెనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, కాల్షియం మరియు ఐరన్ క్యాన్సర్ కణాలతో పోరాడటానికి మరియు వాటి పెరుగుదలను నిరోధిస్తాయి.వేరుశెనగలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి మేలు చేస్తాయి. నానబెట్టిన వేరు శెనగలను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ చర్మానికి అందమైన మెరుపు వస్తుంది. డైటీషియన్ల అభిప్రాయం ప్రకారం, నానబెట్టిన పల్లీలు తినడానికి ఉత్తమ సమయం ఉదయం పరగడుపున అల్పాహారానికి ముందు.