Health Benefits : ఈ ఆకుకూరను తిన్నామంటే …కంటి చూపు అస్సలు తగ్గదు….
Health Benefits : ఈ తరం వారికి కంటిచూపు బాగా మందగిస్తుంది. దీనికి కారణం టెలివిజన్లు, మొబైల్స్ ను ఎక్కువగా చూడడం. అంతేకాకుండా ఆకుకూరలను తక్కువగా తినడం. ముఖ్యంగా ఈ రెండు కారణాల వల్ల కంటిచూపు బాగా తగ్గుతుంది. కంటిచూపు తగ్గకుండా ఉండాలంటే టెలివిజన్లు, మొబైల్స్ ను చూడకుండా వుండాలి. ఈ తరం వారికి అది సాధ్యం కాని పని. తినకుండా అయిన వుంటారు కాని వాటిని చూడకుండా ఉండలేరు. అందుకే కనీసం ఆకుకూరలను అయిన తినాలి. అన్ని ఆకుకూరలలో బచ్చలికూర ఎంతో ప్రధానమైనది. ఇది కంటిచూపు రాకుండా కాపాడుతుంది. ఈ ఆకుకూర ఎంత విలువైనదో ఇప్పుడు తెలుసుకుందాం… బచ్చలికూర తినడం వలన మనకు ఆరోగ్యపరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ బచ్చలికూరలో విలువైన పోషకాలు వుంటాయి.
ఈ బచ్చలికూరలో 3.5 గ్రాముల కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. 104 గ్రాముల ఫోలిక్ ఆమ్లం ఉంటుంది. కొవ్వులు అస్సలు ఉండవు. రెండు గ్రాముల మాంసకృత్తులు ఉంటాయి. 100 గ్రాముల బచ్చలికూరలో 20 క్యాలరీల శక్తి వుంటుంది. రోజు మన బాడీకి 400 గ్రాముల పోలిక్ ఆమ్లం కావాలి. ఫోలిక్ ఆమ్లం మన శరీరంలో రక్తకణాలు తయారు అయ్యేలా చేస్తుంది. చనిపోయిన కణాలు మళ్లీ పుట్టడానికి ఈ ఆమ్లం చాలా అవసరం. జంతువులలో ఉండే ప్రోటీన్స్ కంటే బచ్చలికూరలో వుండే ప్రోటీన్స్ నే మన బాడీకి ఆరోగ్యపరంగా చాలా మంచివి. నాన్ వెజ్ ఎక్కువగా తినేవారిలో హోమోసిస్టీన్ అనే ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. దీనివలన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.అయితే ఈ బచ్చలికూరలో ఉండే కెమికల్ కాంపోజీషన్ ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది
అని వైద్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. బచ్చలికూరలో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ లాంటి విలువైన పోషకాలు ఉంటాయి. ఇవి మన ఎముకల బలానికి సహాయపడతాయి. 100 గ్రాముల బచ్చలికూరలో 400 గ్రాముల కాల్షియం లభిస్తుంది. పాలలో కంటే బచ్చలికూరలోనే ఎక్కువగా కాల్షియం లభిస్తుంది. కాబట్టి బచ్చలికూరను ఎక్కువగా తినాలి. బచ్చలికూర ఒక్కటే తినాలనిపించకపోతే పప్పులో వేసుకోని తినాలి. పప్పులో వేసుకోని తింటే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వారానికి రెండు, మూడు సార్లు అయిన బచ్చలికూరను తినాలి. ఇలా తింటే మనం బ్రతికి ఉన్నంతవరకు కంటి చూపు తగ్గదు. బచ్చలికూరకు అంత శక్తి ఉంటుంది. కనుక బచ్చలికూరను ఎక్కువగా తినాలి. కంటిచూపు తగ్గకుండా కాపాడుకోండి.