Health Benefits : మీరు పొడి దగ్గుతో బాధపడుతున్నారా.? అయితే 12 రోజుల్లో ఈ చిట్కాతో శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు…!
Health Benefits : చాలామంది చలికాలం వచ్చిందంటే జలుబులు, దగ్గుల తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎటువంటి మెడిసిన్ వాడినా కానీ ఈ సీజనల్ వ్యాధులు అసలు తగ్గవు. అయితే ఈ చలికాలంలో వాతావరణంలో మార్పులు వలన చాలా అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సులు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ వాతావరణంలో మార్పులు రావడం వలన దగ్గు ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈ క్రమంలో శరీరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అలాగే చాలామందిలో చిరాకు, నీరసం అలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలిఅంటే ఈ ఇంటి చిట్కాలను ఉపయోగించాలని వైద్య నిపుణులు చెప్తున్నారు.. ఈ పొడి దగ్గు నుండి బయటపడాలి అంటే ఈ చిట్కాలను ఉపయోగించాలి.
1) ఉప్పు, అల్లం : అల్లం అనేది ఎప్పుడు మార్కెట్లో దొరుకుతుంది. అలాగే ఇది వంట రుచిని కూడా పెంచడానికి ముఖ్యపాత్ర పోషిస్తూ ఉంటుంది. కావున దీనిని ఎక్కువగా వంటలో ఉపయోగిస్తారు. అలాగే జలుబులకు గొప్ప ఔషధంలా ఉపయోగపడుతుంది. అయితే ఈ సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడేవారు అల్లం రసాన్ని తీసుకొని అందులో తగినంత ఉప్పు వేసి తీసుకున్నట్లయితే శరీరానికి చాలా రకాల ఉపయోగాలు కలుగుతాయి.
2) నల్ల మిరియాలు : ఈ నల్ల మిరియాలు శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి. అలాగే అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగించడానికి దివ్య ఔషధంగా పనిచేస్తూ ఉంటాయి. అయితే సీజనల్ వ్యాధి నుండి సులభంగా బయటపడడానికి తేనెలో నల్ల మిరియాల పొడి వేసి తీసుకున్నట్లయితే సులభంగా వాటికి చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు..
3) వేడి నీటిలో తేనె కలుపుకొని తాగండి : ఈ చలికాలంలో అస్సలు చల్లని వాటరు తాగకూడదు. అయితే వీటికి బదులుగా వేడి నీటి తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ సీజనల్ వ్యాధుల నుండి బయటపడడం కోసం వేడి నీటిలో తేనె కలుపుకొని తాగాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ నీటిని నిత్యం తీసుకున్నట్లయితే శరీరాన్ని అన్ని వ్యాధుల నుండి కాపాడుతుంది..