Health Problems : ఈ లక్షణాలు ఉంటే గుండెలో రంధ్రం ఉన్నట్లే… వెంటనే వైద్యుడిని సంప్రదించండి… లేదంటే…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Health Problems : ఈ లక్షణాలు ఉంటే గుండెలో రంధ్రం ఉన్నట్లే… వెంటనే వైద్యుడిని సంప్రదించండి… లేదంటే…!

Health Problems : ప్రస్తుత కాలంలో చాలామంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు సరైన సమయంలో ఈ వ్యాధులను గుర్తించలేక తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు. అదే సమయంలో గుండె కు సంబంధించిన తీవ్రమైన సమస్య గుండెలో రంధ్రం ఉండడం. గుండెలో రంధ్రం ఉండటం అనేది ఒక తీవ్రమైన సమస్య. నిజానికి ఈ సమస్య పుట్టుకతోనే వస్తుంది. కానీ గుండెలో రంధ్రం ఏర్పడితే దాని లక్షణాలను సరైన సమయంలో గుర్తించడం చాలా […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 September 2022,5:00 pm

Health Problems : ప్రస్తుత కాలంలో చాలామంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు సరైన సమయంలో ఈ వ్యాధులను గుర్తించలేక తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు. అదే సమయంలో గుండె కు సంబంధించిన తీవ్రమైన సమస్య గుండెలో రంధ్రం ఉండడం. గుండెలో రంధ్రం ఉండటం అనేది ఒక తీవ్రమైన సమస్య. నిజానికి ఈ సమస్య పుట్టుకతోనే వస్తుంది. కానీ గుండెలో రంధ్రం ఏర్పడితే దాని లక్షణాలను సరైన సమయంలో గుర్తించడం చాలా కష్టం. అయితే సరైన సమయంలో గుర్తించడం ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో గుండెకు రంధ్రం ఏర్పడినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండెలో రంధ్రం ఉంటే ఎల్లప్పుడూ అలసటగా అనిపించడం, ఎక్కువగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఎల్లప్పుడూ అలసిపోయి ఎక్కువగా చెమటలు పడుతూ ఉంటే దానిని నెగ్లెట్ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే గుండెలో రంధ్రం ఉంటే శరీరం వేడి వాతావరణం లో కూడా చల్లబడడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వేసవికాలంలో చల్లగా ఉన్న లేదా మీ శరీరం ఎల్లప్పుడు చల్లగా ఉంటే అప్పుడు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే అలాంటి సమస్య ఉంటే గుండెకు రంధ్రం లేదా గుండె సంబంధిత వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.

Health Problems Of Heart Hole In Heart Symptoms

Health Problems Of Heart.. Hole In Heart Symptoms

గుండెలో రంధ్రం సమస్యతో బాధపడే వారు ఉంటే పిల్లల శరీరం రంగు నీలం రంగులోకి మారుతుంది. ఈ సమయంలో పెదవులు, గోర్లు తీవ్రంగా ప్రభావితమవుతాయి. అటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అలాగే మీరు మాట్లాడేటప్పుడు లేదా నడుస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం ప్రారంభిస్తే గుండెలో రంధ్రం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో పిల్లలు కూడా మాట్లాడేందుకు ఇబ్బంది పడుతూ కనిపిస్తారు. శ్వాస తీసుకోవడంలో మళ్లీ మళ్లీ ఇబ్బంది ఉంటే నిమోనియా, గుండె జబ్బులు లేదా గుండెలో రంధ్రం వంటి సమస్యలను కూడా కలిగి ఉండవచ్చు. అలాంటప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది