Health Problems : తులసి అతి వినియోగం… అనేక కారణాలకు దారితీస్తుంది…
Health Problems : తులసికి మన హిందూ మతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన హిందువులు తులసి మొక్కను పవిత్రమైనదిగా భావిస్తారు. అలాగే ఆయుర్వేదంలో తులసి ఒక దివ్య ఔషధంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా తులసిని చర్మ సంబంధిత వ్యాధులకు, అంటువ్యాధులకు, ఇతర ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే తులసి నీ ఎక్కువగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. తులసిని ఎన్నో శతాబ్దాలుగా ఆయుర్వేదం చికిత్సలో సాంప్రదాయ ఔషధంగా ఉపయోగించబడుతుంది. అయితే దీనిని ఎక్కువగా ఉపయోగిస్తే ఇతర సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. తులసి వలన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో, అలాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయట.
తులసి సీజనల్ గా వచ్చే జలుబు, ఫ్లూ వంటి వ్యాధులను నయం చేయడంలో బాగా సహాయపడుతుంది. శరీరంలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. అలాగే కిడ్నీ సమస్యలను నయం చేస్తుంది. పాముకాటు సమయంలో తులసిని చికిత్సలో ఉపయోగిస్తారు. జీర్ణ సమస్యలకు తులసి బాగా పనిచేస్తుంది. శ్వాసకోశ సమస్యలకు తులసి బాగా పనిచేస్తుంది. తులసి వలన ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఎక్కువగా తింటే ఇబ్బందులు కూడా అంతే ఉన్నాయి. తులసి ఆకులు ఎక్కువగా తినడం వలన గర్భిణీ స్త్రీల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. కొన్ని సందర్భాల్లో గర్భస్రావం కావడానికి కూడా దారితీస్తుందని అంటున్నారు.
హెర్బ్ గర్భాశయం కటి ప్రాంతాలకు రక్త ప్రవాహాన్ని ప్రేరేపించడం ద్వారా తీవ్రమైన గర్భాశయ సంకోచనలను ప్రేరేపిస్తుంది. తులసి ఎక్కువగా తింటే బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ తప్పుతుంది. అలాగే సంతానం ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. తులసి సంతాన ఉత్పత్తిపై ప్రభావితం చూపుతుందని తేలింది. ఇది స్పెర్మ్ కౌంటింగ్ తగ్గిస్తుందని వైద్యులు తేల్చారు. అలాగే తులసిని ఎక్కువగా తింటే దంతక్షయం సమస్య పెరుగుతుంది. అంతేకాకుండా తులసిని ఎక్కువగా తినడం వలన కాలేయం దెబ్బతింటుంది. కనుక తులసిని పరిమితంగా తినడం మంచిది.