Health Problems : భోజనం చేశాక మధ్యాహ్నం నిద్ర పోతున్నారా… అయితే మీరు డేంజర్ లో పడ్డట్టే…
Health Problems : సహజంగా అందరూ భోజనం అయిన మరుక్షణమే అలా విశ్రాంతి తీసుకోవడానికి మధ్యాహ్నం పూట పడుకుంటూ ఉంటారు. ఇలా కొందరికి అలవాటుగా కూడా మారుతుంది. అయితే ఇలా భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం టైం పడుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఒక అర్థగంట నిద్రపోతే పరవాలేదు. కానీ అర్థగంట కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం అనేది.. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యరంగం వారు చెప్తున్నారు. ఇప్పుడు చేంజ్ అయిన జీవన విధానం మూలంగా అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా ఉండడం, తెల్లవారిన తర్వాత కూడా లేవకపోవడం లాంటి వాటికి బాగా అలవాటు పడ్డారు. ఇది ఇలా కొనసాగడం వలన ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడతారు.
అందువలన మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్ర వస్తున్నట్లు అనిపించి నిద్ర పట్టేసి గంటల తరబడి నిద్రిస్తూ ఉంటాం. దాని మూలంగా రాత్రి సమయంలో సరియైన నిద్ర పట్టదు. శరీరానికి సరియైన విశ్రాంతి కూడా దొరకదు. ఇది మన జీవనచక్రం పై తీవ్ర చెడు ప్రభావం పడుతుంది. దాదాపు 3 లక్షల మంది పై జరిపిన పరీక్షలు ఈ విషయాలు బయటికి వచ్చాయి. నాలుగు ఏండ్ల పాటు జరిపిన అధ్యాయంలో కొన్ని రకాల పరీక్షలను చేసి ఫలితాలను తెలియజేశారు. మధ్యాహ్నం పూట పదేపదే నిద్రపోయే వారిలో అధిక బరువు పెరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ క్యాంపస్లో చేసిన ఓ అధ్యయనం విధానంగా మధ్యాహ్న టైంలో అధికంగా నిద్రపోయే వారిలో హార్ట్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు వెలువడింది. ఎక్కువసేపు పడుకోవడం కంటే తక్కువ టైం పడుకోవడం వలన ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి.
ఇది మీ ఒత్తిడిని దూరం చేస్తుంది. దీర్ఘకాలం నిద్ర పోవడం కంటే 30 నిమిషాలు వరకు నిద్రపోయేవారు ఆరోగ్యం గా ఉంటారని ఆధ్యాయం తెలిపింది. అదేవిధంగా మధ్యాహ్నం రకరకాల పనులు చేయడం వలన మన శరీరం అలసటకి గురవుతుంది కాబట్టి తగినంత విశ్రాంతి శరీరం కోరుకుంటుంది. దానికి నిద్ర అనేది అత్యంత అవసరం నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి సమయంలో సరియైన నిద్రను పోవకపోవడం లాప్టాప్ లు, సిస్టం, ఫోన్లు, డ్రగ్స్, మద్యం తాగడం లాంటి వాటి వలన నిద్రకి భంగం కలిగిస్తుంది. పలువురు సరైన సమయంలో నిద్ర పోరు.. ఇది అధిక పరిమాణాలకు కూడా దోహదపడుతుంది. కావున అందరూ రాత్రిపూట ఎనిమిది గంటలు నిద్రపోవడం అనేది ఆరోగ్యానికి శ్రేయస్కరమని చెప్తున్నారు.