Health Tips : ఈ గింజలు తీసుకుంటే బరువు ఇట్టే తగ్గిపోతారు..
Health Tips : బరువు పెరగాలన్నా, బరువు తగ్గాలన్నా.. ఆహారానిది అతి ముఖ్యమైన పాత్ర. ఆహారంలో చేసే మార్పులు అధిక బరువు సమస్యను తగ్గించడంలో చాలా బాగా సహకరిస్తుంది. ఒక చిన్న చిట్కా చాలా త్వరగా మన శరీరంలోని కొవ్వును కరిగించి బరువును అమాంతం తగ్గిస్తుంది. దీని కోసం వాడాల్సిన పదార్థాలు అవిస గింజలు, జీల కర్ర అలాగే కరివేపాకు.మొదట కరివేపాకు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రను తీసుకుని దానిని స్టవ్ మీద పెట్టి అది కొద్దిగా వేడి కాగానే ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా అవిసె గింజలు, నాలుగైదు రెబ్బల కరివేపాకులు తీసుకుని పాత్రలో బాగా వేయించాలి. పొడి పొడిగా అయిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.
ప్రతి రోజూ ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక స్పూన్ పొడిని కలుపుకుని తాగడం వల్ల శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోయి బరువు తగ్గడం మొదలవుతుంది.ఈ చిట్కాలో అవిసె గింజలు జీవక్రియ రేటు అలాగే జీర్ణ క్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి కేలరీలను వేగంగా బర్న్ చేయడానికి ఇది పని చేస్తుంది. అవిసె గింజలు ఫైబర్ ను పుష్కలంగా అందిస్తుంది. ఇది కొద్దిగా తీసుకోగానే కడుపు నిండిన ఫీల్ వస్తుంది. అలాగే ఇతర బరువు తగ్గించే ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అవిసె గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది.
జీలకర్ర జీర్ణక్రియను సహాయపడి మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయ పడుతుంది. జీరా నీరు జీర్ణ క్రియకు సాయపపడుతుంది. అలాగే ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. కొవ్వు బర్నింగ్ ప్రక్రియను జీలకర్ర వేగవంతం చేస్తుంది. ఇది అధిక ఆకలిని కంట్రోల్ చేస్తుంది.కరివేపాకును నమలడం లేదా తినడం వల్ల శరీరం నుండి వచ్చే హానికారకమైన విషాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే దానిని శరీరం నుండి తొలగిస్తుంది. అందువల్ల ఆకులు శరీరాన్ని సహజంగా నిర్విషీకరణ చేయడానికి ఎక్కువ కేలరీలను కరిగించడానికి ఉపయోగపడుతుంది.