Obesity : ఊబకాయంతో బాధపడుతున్నారా.. అయితే ఈ గింజలు తిని చూడండి.. వారంలోనే ఎంతో మార్పు!!
Obesity : ఇప్పుడున్న జీవన విధానంలో అందరూ ఉరుకుల, బేరుకుల జీవనాన్ని సాగిస్తున్నారు. అలాంటి క్రమంలో తీసుకునే ఆహారంలో ఎన్నో మార్పులు, అలాగే ఉండే విధానంలో ఎన్నో మార్పులు వలన మానవుడుకి ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అలాంటి వ్యాధులలో ఒకటి ఊబకాయం, అధిక బరువు దీంతో చాలామంది ఏంటో ఇబ్బంది పడుతున్నారు. ఇలా అధిక బరువు పెరిగిపోవడం వలన కుటుంబ సభ్యులతో సరిగా గడపలేకపోతుంటారు. పదేపదే ఎదుటివారితో పోల్చుకుంటూ చూసుకోవాల్సి వస్తుంది. అలా ఎంతో బాధపడుతూ ఉంటారు. నేను స్లిమ్ గా ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఇప్పుడు ఒక శుభవార్త. అదేమిటంటే ఈ గింజలు తినడం వలన ఊబకాయం, అధిక బరువు తగ్గుతారు అని పేర్కొన్నారు. వైద్య నిపుణులు… అయితే అధిక బరువు తగ్గడానికి ఎలాంటి గింజలను ఆహారంలో చేర్చుకుంటే మంచిదో తెలుసుకుందాం..
పొద్దుతిరుగుడు గింజలు : ఈ గింజలు అధిక బరువు తగ్గడానికి చాలా సహాయపడతాయి. వీటిలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. వీటిని కొన్ని సూప్ లలో కలుపుకొని తినడం వలన, బాడీలో అధికంగా ఉన్న క్యాలరీస్ కరిగిపోయి బరువు రోజురోజుకి తగ్గిపోతూ ఉంటారు. చియా గింజలు : ఈ గింజలు ఊబకాయాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకనగా… ఈ గింజలు ఆకలిని తగ్గించడానికి ప్రభావంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ చియా గింజలను తినడం వలన ఎక్కువ సమయం ఆకలి లేకుండా ఉంటుంది. ఇలా బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
అవిస గింజలు : ఈ అవిసె గింజలు ప్రతిరోజు నాలుగు స్పూన్లు వేయించుకొని తినడం వలన దీనిలో ఉన్న ఒమేగా 3 శరీరంలో ఉన్న అధిక కొవ్వును తగ్గించడమే కాకుండా, మన గుండెని కూడా దృఢంగా తయారు చేస్తుంది. అదేవిధంగా ఈ గింజలలో ఐరన్ ఫైబర్ ప్రోటీన్ అధికంగా ఉన్నాయి. అయితే వీటిని ఇలా తినలేని వాళ్లు ఈ ఆవిస గింజలను పొడి చేసుకొని వంటలలో వాడుకోవచ్చు. ఈ విధంగా ఈ గింజలను వాడినట్లయితే మీ అధిక బరువు, ఊబకాయం వారంలో మార్పు రావాల్సిందే.. అని వైద్య నిపుణులు తెలియజేశారు.