Health Tips : ఈ లక్షణాలు కనిపిస్తే.. పాలిసిస్టిక్ కిడ్నీ జబ్బుకి సంకేతం అవ్వచ్చు… అప్రమత్తం అవ్వకపోతే…
Health Tips : చాలామందికి కిడ్నీకి సంబంధించిన వ్యాధులు సంభవిస్తూ ఉన్నాయి. అయితే ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధులలో ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం వ్యాధి సంభవిస్తూ ఉంటుంది. అయితే ఈ పాలి సిస్టిక్ కిడ్నీ వ్యాధి మూలంగా కిడ్నీలలో తిత్తులు వస్తూ ఉంటాయి. దీనిలో ద్రవం కూడా కలిగి ఉంటుంది. కొన్ని సమయాలలో పొక్కులు కూడా వస్తుంటాయి. ఈ జబ్బులో కిడ్నీల పనితీరు తగ్గిపోతుంది. కిడ్నీ అంటే మన శరీరంలో చాలా ముఖ్యమైన ఒక పార్ట్. ఇది మూత్ర రూపంలో శరీరంలో ఉండే చెడు వ్యర్ధాలను కొన్ని కెమికల్స్ ను బయటికి పంపించడం తిని ప్రధానమైన పని. అయితే ఈ కిడ్నీలలో ఏదైనా తేడా అనిపిస్తే ఈ కిడ్నీలకు ఏదో వ్యాధి సంభవిస్తుంది అని గుర్తుంచుకోవాలి. కిడ్నీలలో చిన్న తిత్తులు రావడం మొదలవుతాయి. దీన్నే పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి అంటారు. సరియైన సమయంలో దీనికి ట్రీట్మెంట్ జరగకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో గుర్తించడం వలన దానిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
చాలా రోజుల నుండి ఈ వ్యాధి కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ వ్యాధి ఏ వయసులో ఆయిన సంభవించవచ్చు.. అయితే ఈ వ్యాధిని సరియైన సమయంలో గుర్తించకపోతే కిడ్నీలు చెడిపోయే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడికి కూడా ఛాన్స్ ఉంటుంది. అయితే అసలు ఈ వ్యాధి రావడానికి కారణాలు ఏమి లేవని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవి జన్యుపరమైన జబ్బు ఇది ఒక తరం నుంచి మరొక తరానికి సంభవిస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. పి కే డి సోకిన మనుషులు కూడా ప్యాంక్రియాస్, కాలేయంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. రక్తపోటు ఉన్న వ్యక్తులకి పాలిసిస్టిక్ కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం అధికంగా ఉంది..
ఈ లక్షణాలు ఆలస్యంగా గుర్తిస్తుంటారు… ఈ జబ్బు లక్షణాలు ఆలస్యంగా బయటపడుతుంటాయి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత శరీరంలో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఆ టైంలో పీ కే డి లక్షణాలు కనబడతాయి. ఆ లక్షణాలు ఇవే… పదేపదే మూత్ర విసర్జన, ఎప్పుడు ఎన్ను నొప్పి, అలాగే పొత్తి కడుపు పెరగడం, యూరిన్ లో రక్తం రావడం, లాంటివన్నీ ఈ వ్యాధికి లక్షణాలు, ఈ లక్షణాలు ఉన్నవారు డేంజర్ లో పడ్డట్లే.. ఒక మనిషి కుటుంబంలో పీకేడితో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ జబ్బు ఒక తరం నుండి మరొక తరానికి సంభవిస్తుంది. ఆ సమయంలో మూత్రపిండాలలో తిత్తులు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఆ లక్షణాలు కనపడితే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.. సరియైన సమయంలో ట్రీట్మెంట్ చేస్తే ఈ జబ్బు సింపుల్ గా తగ్గించుకోవచ్చు. సరియైన టైంలో ట్రీట్మెంట్ పొందడం వలన తిత్తుల సమస్య తగ్గిపోతుంది. కానీ ఈ వ్యాధిగ్రస్తులు దాని గురించి జాగ్రత్తగా ఉండకపోతే ముందు రాబోయే రోజులలో మూత్రపిండాలు ఫెయిల్ అవ్వడం జరుగుతుంది.