Health Tips : ఈ చిట్కాతో పాదాల వాపును నయం చేసుకోండి…
Health Tips : అప్పుడప్పుడు మన శరీరంలో కొన్ని భాగాలు వాపులకు గురవుతూ ఉంటాయి. అయితే సహజంగా వాపులు అనేవి ఏదైనా గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు వస్తుంటాయి. కానీ కొంతమందిలో మాత్రం పాదాలవాపులు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇలా పాదాలవాపులు అనేవి అనేక కారణాల వలన కూడా రావచ్చు. ఇన్ఫెక్షన్లు, గాయాలు, కిడ్నీ సమస్యలు, కీళ్ల నొప్పులు వంటి పలు కారణాల వలన కూడా పాదాలు వాపు వస్తాయి. ఈ పాదాల వాపు సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక బకెట్ నిండా గోరువెచ్చని నీళ్లను తీసుకొని అందులో కొద్దిగా రాతి ఉప్పును వేసి బాగా కలపాలి. తర్వాత అందులో పాదాలు మునిగేలా ఆ బకెట్లో ఉంచాలి. ఇలా 15 నుంచి 20 నిమిషాల దాకా ఉంచాలి. రోజుకి రెండుసార్లు ఇలా చేయాలి. ప్రతిరోజు ఇలా చేయడం వలన పాదాల వాపు తగ్గిపోతుంది. రాతి ఉప్పులో ఉండే ఆంటీఇన్ఫ్లామేటరి గుణాలు పాదాల వాపును తగ్గిస్తాయి. అలాగే పాదాలవాపు ఉన్నవారు నిద్రపోయే సమయంలో పాదాల కింద మెత్తటి వస్తువులు కానీ దిండు కానీ పెట్టుకోవాలి. ఇలా ఎత్తులో పాదాలు ఉంచడం వలన అందులో ఉండే నీరు కిందకు దిగుతుంది. అది రక్త సరఫరా లో కలిసిపోయి మూత్రం ద్వారా బయటకు వస్తుంది. ఇలా చేయడం వలన కూడా పాదాల వాపు నుంచి ఉపశమనం పొందవచ్చు.
పాదాల వాపును తగ్గించుకోవడానికి పుచ్చకాయలు బాగా సహాయపడతాయి. ఈ కాయలో 92 శాతం నీరు ఉంటుంది. అలాగే డయో రేటిక్ పదార్థాలు ఉంటాయి. ఇవి పాదాలలో ఉండే ద్రవాన్ని తగ్గించడంలో సహాయం చేస్తాయి. పాదాల వాపు ఉన్నవారు ప్రతిరోజు ఒక కప్పు పుచ్చకాయ ముక్కలను తింటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ధనియాలలో ఉండే ఆంటీ గుణాలు కూడా పాదాలవాపులు తగ్గిస్తాయి. ధనియాలు ఆయుర్వేదంలో పాదాల వాపును తగ్గించడంలో ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల ధనియాలు వేసి నీరు సగం అయ్యేవరకు బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టి చల్లార్చుకోవాలి. తరువాత రోజుకు రెండుసార్లు ఈ మిశ్రమాన్ని త్రాగడం వలన పాదాలవాపు తగ్గిపోతుంది.