Heart Attack : హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఈ సమయానికి హాస్పిటల్ కి వెళ్తే ప్రమాదం నుంచి బయటపడవచ్చు…!!
Heart Attack : ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ జీవన శైలిలో వయసు తరహా లేకుండా గుండెపోటు ప్రమాదాలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి. గుండెపోటు అని పేరు వింటేనే హడలిపోయే ఈ సమస్య వస్తే ప్రాణాలు డేంజర్ లో పడినట్లే.. కావున ఈ గుండె సంబంధిత వ్యాధులతో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే.. అలాగే ఈ వ్యాధి లక్షణాలు సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా జాగ్రత్తపడాలో తప్పకుండా అవగాహన ఉండాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా గోల్డెన్ అవర్ గురించి అందరూ తెలుసుకోవాలి. అసలు గోల్డెన్ అవర్ అంటే ఏమిటి ఆ టైంలో ఏం చేయాలి.. ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గుండెపోటు వచ్చిన టైంలో సరియైన సమయంలో హాస్పటల్ కి వెళ్లడానికి గోల్డెన్ అవర్ అని పిలుస్తూ ఉంటారు.
అది ఎటువంటి లక్షణాలు కనిపించిన మొదటి గంటలోపు హాస్పటల్ కి వెళ్లడాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ టైం లో రోగిని వైద్యని దగ్గరికి తీసుకెళ్లడం వల్ల అతన్ని రక్షించి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో ఈ టైం యాన్ని గోల్డెన్ అవర్ అంటారు. గుండెపోటు వచ్చినప్పుడు చాలామందికి దడగా అనిపిస్తూ ఉంటుంది. మెడ ప్రాంతంలో దవడ దగ్గర నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఎడమ చేయి వైపు లేదా రెండు చేతులలో కూడా నొప్పి అనిపిస్తూ ఉంటుంది. శరీరంలో పై భాగంలో నొప్పిగా ఉంటుంది. జాతిలో నొప్పిగా ఉండి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇటువంటి సంకేతాలు ఏవి కనపడిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. గుండెపోటు వచ్చిన టైంలో నొప్పి తీవ్రత ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సార్లు నొప్పి తక్కువగా ఉంటుంది.
ఇది సుమారు 8 నుంచి 15 నిమిషాల వరకు ఉంటుంది. ఈ టైంలో ముఖ్యంగా నొప్పి ఉండే ప్రదేశం తీవ్రమై తగ్గడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఈ లక్షణాలను తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. వాటిని అస్సలు పట్టించుకోరు. గ్యాస్ అసిడిటీ వల్ల ఈ లక్షణాలు వస్తున్నాయి అనుకుంటారు. అయితే ఇటువంటి అసిడిటీ నొప్పులైనా సరే ఆలస్యం చేయకుండా వైద్య ను సంప్రదించాలి. తీసుకోవలసిన జాగ్రత్తలు: అయితే గుండెపోటు వచ్చిందని అనుమానంగా ఉంటే తక్షణమే నీటిని తీసుకోవాలి. వచ్చిన రోగి వెంట ఒకరు తప్పకుండా ఉండాలి. ఆస్పత్రికి వెళ్లే వరకు అతడిని దగమని చెబుతూ ఉండాలి.
అవసరమైన టాబ్లెట్స్ ఇస్తూ డాక్టర్ కి ఫోన్ చేసి వేస్తూ ఉండాలి. అలాగే రోగి బట్టలు బిగుతుగా ఉంటే వాటిని లూస్ చేసి అవసరమైతే కృత్రిమ శ్వాస ఇస్తూ ఉండాలి. వారిని సురక్షితంగా ఏదైనా బండిలో తీసుకెళ్లాలి. వారిని మెట్లు ఎక్కించడం ఎక్కువ దూరం నడిపించడం చేయవద్దు. ఈ విధంగా చేయడం వలన ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.. లక్షణాలు గమనించిన డాక్టర్స్ పేషెంట్ కండిషన్ గురించి తెలుసుకోవడానికి వారికి ఇచ్చిన సమస్యను గురించి తెలుసుకోవడానికి ఈసీజీ తీస్తుంటారు. దీని వలన వచ్చిన సమస్య ఏంటి అనేది తప్పకుండా తెలుస్తుంది. ఇక దాంతో పేషెంట్ కి సరైన ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ కారణంగా చాలా వరకు సమస్య నుంచి బయటపడవచ్చు..