Hair Tips : జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలా.. అయితే ఈ చిట్కా మీ కోసమే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలా.. అయితే ఈ చిట్కా మీ కోసమే

 Authored By pavan | The Telugu News | Updated on :24 May 2022,4:00 pm

Hair Tips : జుట్టు ఒత్తుగా, పొడుగ్గా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. నల్లని తాచు పాము లాంటి జడ ఉండాలని అది నడుము వరకు పెరగాలని చాలా మంది మహిళల కోరిక. చాలా కొద్ది మందికి మాత్రమే అలాంటి జుట్టు, జడ ఉంటుంది. అలాంటి వారు ఈ చిట్కాలు పాటించండి. సూపర్ ప్రయోజనం ఉంటుంది. ఈ చిట్కాలు చాలా పాపులర్ కూడా. ఎప్పటి నుంచో వాడకంలో ఉన్న చాలా మందికి తెలిసిన ఈ చిట్కాలు పాటించి చూడండి.. జుట్టు నల్లగా నిగ నిగలాడుతుంది. ముందుగా రెండు స్పూన్ల బియ్యాన్నితీసుకోండి. ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగి తర్వాత నాలుగు లీటర్ల నీటిలో వేయండి. ఈ బియ్యాన్ని రెండు గంటల పాటు నానబెట్టు కోవాలి.

దీని కోసం స్టీల్ గిన్నె లేదా ఐరన్ పాత్రను మాత్రమే వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ గిన్నె వాడకూడదు.అలాగే నాన్ స్టిక్ గిన్నెలు వాడటం వల్ల లాభాలు దేవుడెరుగు వాటి వల్ల నష్టాలే ఎక్కువ. రెండు గంటల పాటు నాన బెట్టిన గిన్నెలో కొన్ని మందార ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే రేఖ మందార పూలను తీసుకొని నీటిలో వేయాలి. మందార పూలు, ఆకులు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. తర్వాత ఈ మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టి బాగా మరిగించాలి. మరిగిన పూలు, మందార ఆకుల యొక్క గుణాలు నీటిలో దిగిన తర్వాత మంట ఆపేసి పక్కన పెట్టుకోవాలి.

if you want your hair to grow thicker and longer this tip is for you

if you want your hair to grow thicker and longer this tip is for you

బాగా మరిగించిన ఆ నీటిని వడకట్టుకోవాలి. తర్వాత ఆ నీటిని ఒక స్ప్రే బాటిల్ వేసుకోవాలి.ఇంకొక చిట్కా కోసం ఒక ఉల్లిపాయ తీసుకొని బాగా తురమాలి. తర్వాత ఉల్లిపాయల పేస్ట్ ను వడకట్టి రసాన్ని తీసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె కలుపుకోవాలి. ఇది జుట్టును డ్రై అవ్వకుండా కాపాడుతుంది. తర్వాత ఇంతకు ముందు తయారుచేసుకున్న బియ్యం నీటిని ఒక మూడు స్పూన్లు కలుపుకోవాలి.ఉల్లిపాయ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేయాలి. బియ్యం మిశ్రమాన్ని మిగతా జుట్టుకు స్ప్రే చేయడం ద్వారా అప్లై చేయాలి. తర్వాత జుట్టును బాగా మసాజ్ చేసి ముడి వేసుకోవాలి. రెండు గంటల తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం రెండు సార్లు చేస్తే జుట్టు సమస్యలు అన్నీ తొలగిపోతాయి. జుట్టు బలంగా తయారు అవుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది