Eyes : ఒక్కసారి రాస్తే చాలు.. కళ్ల కింద నలుపు మటుమాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Eyes : ఒక్కసారి రాస్తే చాలు.. కళ్ల కింద నలుపు మటుమాయం…!

 Authored By aruna | The Telugu News | Updated on :25 July 2023,7:00 am

Eyes : సాధారణంగా చాలామందికి కంటికి డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. దీనికి కారణాలు చాలా ఉన్నాయి.. నిద్ర లేకపోవడం ఎక్కువ మొబైల్స్ స్క్రీన్ లను చూడడం టెన్షన్ ఇలాంటివన్నీ వీటికి కారణాలు ఎక్కువ నిద్ర లేకపోయినా ఈ కంటికింద నల్లటి వలయాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎందుకు వస్తాయి.. వీటిని ఎలా తగ్గించుకోవాలి అనుకుంటే చెప్పినట్టు చేయండి చాలు.. ఇలా కంటి కింద నల్లటి వలయాలు వస్తున్నాయి అంటే మీ శరీరంలో ఏదో మార్పు చోటు చేసుకుంటుందని అర్థం. కంటి కింద పొర చాలా పలచగా ఉంటుంది.

ఎక్కువ సేపు ఫోన్ చూడటం వలన కలుషితమైన గాలి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, పొగ తాగడం, ఎండలో బాగా తిరగడం ఇవన్నీ కూడా కంటి కింద నల్లటి వలయాలు రావడానికి కారణాలు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా.. కంటి డార్క్ సర్కిల్స్ పోగొట్టుకోవడానికి సంబంధించిన పదార్థాలు మీ ఇంట్లోని వంట గదిలోనే దొరుకుతాయి. కొంతమంది ఇళ్లలో ఇది ఉండకపోవచ్చు. కానీ ఈ పదార్థం దగ్గర్లోని షాప్స్ లో కూడా దొరుకుతుంది. మీకు తెలుసా.. అదే కరక్కాయ ఈ కరక్కాయలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. దీనిని ఎలా వాడుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఒక చిన్న స్థాన తీసుకోండి.. దానిమీద కొద్దిగా నీళ్లు చల్లి ఈ కరక్కాయని కొద్దిసేపు అరగదీయండి.

If you write once the black under the eyes will disappear

If you write once the black under the eyes will disappear

అలా అరగదీసినప్పుడు ఒక క్రీమ్ లాంటిది వస్తుంది. మీరేం చేయాలంటే మీ ఉంగరపు వేలుతో ఆ పేస్ట్ తీసుకుని మీ కంటి నీ అద్దంలో చూస్తూ ఆ నల్ల వలయాలు మీద రాసుకోండి. ఇలా రోజుకి ఒకసారి చొప్పున వారం రోజులు చేయండి. నెమ్మది నెమ్మదిగా మీ కంటికి నల్లటి మచ్చలు తగ్గుతాయి. దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎప్పుడైనా దీన్ని రాసుకోవచ్చు. కాబట్టి ఎవ రికైతే ఈ విధంగా డార్క్ సర్కిల్స్ ఉన్నాయో వారు ఈ విధంగా చేయడం మొదలుపెట్టండి. కొద్ది రోజుల్లోనే మీకు దాని ప్రభావం తెలుస్తుంది.

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది