Hair Tips : వారానికి ఒక్కసారి ఇలా చేస్తే చాలు.. జుట్టు కుదుళ్ల నుంచి బలంగా పెరుగుతుంది! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : వారానికి ఒక్కసారి ఇలా చేస్తే చాలు.. జుట్టు కుదుళ్ల నుంచి బలంగా పెరుగుతుంది!

 Authored By pavan | The Telugu News | Updated on :27 May 2022,4:00 pm

Hair Tips : జుట్టు సమస్యలు ఉన్న వారు ఈ ప్యాక్ వారానికి ఒకసారి వేసుకున్నట్లయితే జుట్టు ఊడమన్నా ఊడిపోదు. జుట్టు కుదుళ్ల నుంచి బలంగా, ఒత్తుగా పెరుగుతుంది. రెండు చెంచాల మెంతి పిండి, రెండు చెంచాల వేపాకు పొడి, రెండు చెంచాల ఉసిరికాయ పొడి, రెండు పెద్ద గరిటెల పెరుగు కలిపి ఈ ప్యాక్ చేసుకోవాలి. మెంతి పిండి వల్ల ఒత్తిడి బాగా తగ్గుతుంది. అలాగే మెంతి పిండిలో ప్రోటీన్ నికోటిన్ జుట్టు ఆరోగ్యంగా ఉండి దాని వల్ల జుట్టు ఊడే సమస్య కొంత వరకు తగ్గుతుంది. వేపాకులు నీడలో 5 రోజులు ఎండబెట్టి పొడి చేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ పొడి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. వేపాకు యాంటీ బాక్టీరియల్ గుణాలను కల్గి ఉంటుంది. దీని వల్ల చుండ్రు, దురద ఉంటే తగ్గి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఉసిరి కాయ గింజలు తీసి ఎండ బెట్టుకొని పొడి చేసుకోవాలి. ఈఈ పొడి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది.

ఉసిరికాయ సర్వ రోగ నివారిణి అంటారు. ఉసిరి కాయ వల్ల చిన్న వయసులో బాల్ హెడ్ రావడం, జుట్టు ఊూడిపోవడం, తెల్ల వెంట్రుకలు రావడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉసిరి కాయ తరచుగా వాడటం వల్ల తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తుంది. ఉసిరి కాయ ఆరోగ్యానికే కాకుండా జుట్టు కూడా బాగా పని చేస్తుంది. పెరుగుకి బదులుగా గుడ్లు రెండు వేసి కలుపుకొని ప్యాక్ పెట్టుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మాడుకి బాగా పట్టేలా అప్లై చేసుకోవాలి. ఇంకా మిగిలితే జుట్టుకి కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 30 నుండి 40 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి కసారి చేయడం వల్ల జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది.

super easy genius hair hacks for block and long thick hair

super easy genius hair hacks for block and long thick hair

అలాగే నల్లగా కొత్తగా కూడా ఉంది.పెరుగు యాంటీ ఫంగల్ లక్షణాలను కల్గి ఉంటుంద. దీని వల్ల స్కాల్ఫ్ క్లీన్ గా ఉంచుతుంది. స్కాల్ఫ్ క్లీన్ గా ఉండటం వల్ల జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది. పెరుగు పడక పోతే అవిసె గింజల జెల్ లేదా అలోవెరా జెల్ లేదా ఆలివ్ జ్యూస్ చేసుకోవచ్చు నీళ్లు మాత్రం వేసుకోకూడదు. ఈ ప్యాక్ జుట్టు ఊడడం తగ్గించి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఈ ప్యాక్ ఈజీగా ఇంట్లోనే చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అప్లై చేశాక 30 నుంచి 40 నిమిషాల ఆరనిచ్చి ఏదైనా హెర్బల్ షాంపూతో వాష్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల చుండ్రు, దురద, తెల్ల వెంట్రుకలు, జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా, నల్లగా, దృఢంగా తయారవుతుంది.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది