Hair Tips : వీటితో తయారు చేసే నూనెను తలకు రాస్తే.. తెల్ల వెంట్రుకలు రమ్మన్నా రావు!
Hair Tips : మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా చిన్న వయసులోనే ప్రతీ ఒక్కరికి తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. పెద్ద వయసు వారికి వెంట్రుకలు తెల్ల బడినా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ చిన్న వయసు వారికి, టీనేజ్ లో ఉన్న వారికి తెల్ల వెంట్రుకలు వస్తే వారు పడే బాధ అంతా ఇంతా కాదు. వీటి వల్ల వారు నలుగురిలోకి వెళ్లాలంటనే చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఆ తెల్ల వెంట్రుకలు దాచి పెట్టేందుకు రకరకాల హెయిర్ కలర్ లను వాడుతుంటారు. ఈ హెయిర్ కలర్ వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తల భాగంలో చర్మంపై రాషెస్ రావడం, తలనొప్పి రావడం వంటివి జరుగుతాయి.
అందుజే జుట్టు నల్లబడడానికి మార్కెట్లో దొరికే వాటిని వాడటం కంటే నాచరల్ పద్దతిలో తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చుకోవడం మంచిది. అయితే మేం ఇప్పుడు చెప్పబోయే చిట్కా ఉపయోగిస్తే… 60 ఏళ్ల పైబడినా సరే తెల్ల వెంట్రుకలు మాత్రం రావు. ఈ నూనెను తయారు చేసుకొని ప్రతీ రోజు వాడటం వల్ల వెంట్రుకలు తెల్లబడడం తగ్గుతుంది. ఈ నూనె తాయరు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కలబంద, గుంటగలగరాకు, గుంధకచ్చూరాలు. ముందుగా ఒక కలబంద మట్ట తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి లోపలి జెల్ మాత్రమే తీసి ఒక గిన్నెలో వేస్కోవాలి. తర్వాత స్టౌ పై ఒక పాన్ పెట్టి 100 గ్రాముల అలోవెరా జెల్, 100 గ్రాముల గుంటగలగరాకు పొడిని వేసుకొని 300 గ్రాముల కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె వేసుకోవాలి. మంచి నువ్వుల నూనె ఉపయోగిస్తే మరింత మంచిది.

white hair prevention home made oil
నూనెను బాగా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేయడానికి పావుగంట ముందు గంధకచ్చూరాలు పౌడర్ వేసుకొని మరిగించుకోవాలి. నూనెలో నీల్లు లేకుండా మొత్తం ఇంకిపోయేవరకు మరిగించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి నూనె చల్లార్చుకోవాలి. తర్వాత నూనెను వడకట్టుకొని ప్రతిరోజూ తలకు పెట్టుకోవాలి. బయటకు వెళ్లాలి అనుకున్న వాళ్లు రాత్రి నూనె పెట్టుకొని ఉదయం తల స్నానం చేయాలి. నూనె పెట్టి వెంటనే తల స్నానం చేయాలని ఏమీ లేదు. ఎప్పుడు తలస్నానం చేసినా పర్వాలేదు. ఈ నూనెను ప్రతిరోజూ అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి కొత్త జుట్టు వస్తుంది. అంతే కాకుండా తెల్ల వెంట్రుకలు రాకుండా సహాయ పడుతుంది. .జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా, దృఢంగా అయ్యేలా చేస్తుంది. అలాగే 60 ఏళ్లు వచ్చినా సరే జుట్టు నల్లగానే ఉంటుంది. మీరూ ఓసారి ఈ నూనెను ట్రై చేయండి.