Chandrayan 3 Success : చంద్రయాన్ 3 సక్సెస్.. అక్కడ అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్ర సృష్టించిన భారత్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrayan 3 Success : చంద్రయాన్ 3 సక్సెస్.. అక్కడ అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్ర సృష్టించిన భారత్

 Authored By kranthi | The Telugu News | Updated on :23 August 2023,6:28 pm

Chandrayan 3 Success : ప్రతి భారతీయుడు సగర్వంగా తల ఎత్తుకునే, కాలర్ ఎగరేసే సమయం ఇది. అవును.. ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు మన దేశం వైపే చూస్తున్నాయి. చంద్రాయన్ 3 సక్సెస్ అవుతుందా? లేదా అని చాలా ఆతృతగా అన్ని దేశాలు ఎదురు చూశాయి. అయితే.. చంద్రయాన్ 3 ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ కాకూడదని.. అది సక్సెస్ అవ్వాలని.. విజయవంతంగా చంద్రడి మీద విక్రమ్ లాండర్ కాలు మోపాలని దేవుడిని మొక్కని భారతీయుడు లేడు. ప్రతి ఒక్కరు దాని సక్సెస్ కోసం ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనలు ఇప్పుడు ఫలించాయి.

చంద్రాయన్ 3 చరిత్ర సృష్టించింది. చంద్రుడి మీద ఉన్న దక్షిణ దృవంపై ఇప్పటి వరకు ఏ దేశం కూడా అడుగు పెట్టలేదు. కానీ.. తొలిసారి భారతదేశం అడుగుపెట్టింది. విక్రమ్ ల్యాండర్ ఇంతకుముందే చంద్రుడిపై ల్యాండ్ అయింది. సాయంత్రం 5.44 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. సాయంత్రం 6.04 నిమిషాలకు విక్రమ్ లాండర్ చంద్రుడిని ముద్దాడింది. దీంతో భారత్ శక్తి ప్రపంచ దేశాలకు తెలిసింది. భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని తెలియజేసింది.

chandrayan 3 super success on moon

chandrayan-3-super-success-on-moon

Chandrayan 3 Success : ఇది భారత ప్రజల విజయం

ఇది ముమ్మాటికీ భారత ప్రజల విజయం అని చెప్పుకోవచ్చు. విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ జాబిల్లి మీద అడుగు పెట్టడంతో ఇక ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుడిపై 14 రోజుల పాటు అక్కడి సమాచారాన్ని సేకరించనున్నారు. విక్రమ్ ల్యాండర్ అక్కడి పరిసరాలను గమనించి దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని ఇస్రోకు చేరవేయనుంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది