Crime News : లోన్ తీసుకున్న పాపానికి మహిళకు వేధింపులు.. చివరకు యాప్ నిర్వాహకులు ఏం చేశారంటే?
Crime News : లోన్ యాప్స్ ఈరోజుల్లో జనాలను ఎంతలా డిస్టర్బ్ చేస్తున్నాయో ప్రతి ఒక్కరికీ తెలుసు. లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. లోన్ తీసుకునే వరకు వెంట పడటం.. ఆ తర్వాత తీసుకున్న లోన్ చెల్లించడం లేదంటూ బెదిరింపులకు పాల్పడటం, టార్గెట్ చేసి రోజూ ఫోన్లు చేసి విసిగించడం.. ఇవన్నీ ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం. ఏదో అవసరానికి కొంత డబ్బు లోన్ తీసుకుంటే చెల్లించలేదంటూ టార్గెట్లు చేసి మాట్లాడటం, బెదిరించడం లాంటివి చేసి జనాలను ప్రశాంతంగా బతకనీయడం లేదు ఈ లోన్ యాప్స్ నిర్వాహకులు.
తాజాగా ఓ యువతి కూడా లోన్ తీసుకునేలా ప్రోత్సహించి ఆ తర్వాత లోన్ తీసుకునేలా చేసి.. తీరా లోన్ చెల్లించడం లేదంటూ ఆమె ఫోటోలనే అశ్లీల వెబ్ సైట్ లో పెడతామంటూ బెదిరించారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ మహిళ లోన్ యాప్ ద్వారా రూ.3 వేల లోన్ తీసుకుంది. ఆ లోన్ డబ్బులు కట్టలేదు. ఆ తర్వాత మరో రూ.15 వేలు లోన్ ఇస్తామంటూ ఆమె వెంట పడ్డారు. నాకు వద్దు అని చెప్పినా కూడా తను వినలేదు. చివరకు ఒక లింక్ పంపించి.. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ అకౌంట్ లో రూ.15 వేలు పడిపోతాయని చెప్పుకొచ్చారు. దీంతో ఆ మహిళ లింక్ క్లిక్ చేసింది. దీంతో రూ.15 వేలు తన అకౌంట్ లో పడిపోయాయి. ఇక.. ఆ తర్వాత తనను ఆ లోన్ చెల్లించాలంటూ వేధించడం మొదలుపెట్టారు.
Crime News : లోన్ చెల్లించకపోతే తన ఫోటోలను ఎస్కార్ట్ వెబ్ సైట్ లో పెడతామన్నారు
ఒకవేళ లోన్ చెల్లించకపోతే తన ఫోటోలను ఎస్కార్ట్ వెబ్ సైట్ లో పెడతామని బెదిరించారు. వాళ్ల టార్చర్ భరించలేక.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ మహిళ. రంగంలోకి దిగిన పోలీసులు.. లోన్ యాప్ లో ఇన్వాల్వ్ అయిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాళ్లది పెద్ద గ్యాంగ్ అని.. ఒక ఐఎంఈఐ నెంబర్ తో 40 ఫోన్లను మెయిన్ టెన్ చూస్తూ..దాదాపు 200 ఫోన్ నెంబర్ల ద్వారా కస్టమర్లకు ఫోన్ చేసి లోన్ డబ్బులు చెల్లించాలంటూ వేధిస్తున్నారని పోలీసులకు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి వాళ్ల దగ్గర్నుంచి పలు సిమ్ కార్డులు, లాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు.