Chandrababu Bail Petition : చంద్రబాబుకు మరో షాక్.. జైలు నుంచి బయటికి రాకుండా భలే స్కెచ్ వేశారు
Chandrababu Bail Petition : స్కిల్ డెవలప్ మెండ్ స్కీమ్ కు సంబంధించిన స్కామ్ లో ఇరుక్కున్న చంద్రబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబును పంపించారు. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఇది కేవలం స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ మాత్రమే కానీ.. చంద్రబాబుపై మరో కేసు కూడా పడింది. అదే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు. ఈ కేసుపై కూడా చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. ఆ కేసు విచారణను వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్ పై కూడా విచారణ జరుగుతోంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాగూ బెయిల్ దొరకలేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అయినా బెయిల్ దొరుకుతుందని చంద్రబాబు తెగ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ కేసులో కూడా బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈనెల 26న విచారణ జరగనుంది. హైకోర్టు ఆ తీర్పును వాయిదా వేసింది. కానీ.. చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై మాత్రం తీర్పు ఇవాళే రానుంది.
Chandrababu Bail Petition : సాయంత్రంలోపు కస్టడీపై రానున్న తీర్పు
బెయిల్ పిటిషన్ ది పక్కన పెడితే చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై మాత్రం ఇవాళ తీర్పు రానుంది. ఇప్పటికే ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. విచారణ కూడా పూర్తయింది. చంద్రబాబు నాయుడు తరుపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్, లూద్రా ఇద్దరూ వాదించారు. ఇక.. ఏపీ సీఐడీ తరుపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మరి చంద్రబాబు కస్టడీని పొడిగిస్తారా? లేక ఏం చేస్తారు.. ఈ కేసుపై తర్వాతి స్టెప్ ఏంటి అనేది త్వరలో కోర్టు తెలియజేయనుంది.