YS jagan : ఢిల్లీకి వెళ్లిన జగన్… పొత్తు విషయంపై మోడీతో ప్రస్తావన…!
YS jagan : కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కొద్దిసేపట్లో లేదా రేపు కేంద్ర మంత్రి అమిత్ షా ను కలవబోతున్నారు. అలాగే నిర్మలా సీతారామన్ ను కలవబోతున్నారు. జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కూడా కలవబోతున్నారు. అయితే ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశాలపై మాత్రమే ఢిల్లీకి వెళ్లలేదని ఆయన దగ్గర ప్లాన్ బి కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాల నుండి స్ట్రాంగ్ సమాచారం వినిపిస్తుంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చే రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయన్న సంగతి తెలిసిందే. అలాగే లోక్ సభ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అయితే రానున్న ఎన్నికల్లో ఎంతవరకు తమ పాచిక పాడుతుంది ,అనే విషయంలో బిజెపి కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ ,పైకి మాత్రం మేకపోతు గంభీర్యం చూపిస్తూ , ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యేల మద్దతు కావాలనే భయం వారిలో ఉంది. కాబట్టి దీనిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నేరుగా నరేంద్ర మోడీ వద్ద అమిత్ షా వద్ద ఒక ప్రపోజల్ ఆఫర్ పెట్టబోతున్నట్లు సమాచారం.
ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు టిడిపి పార్టీ తోటి పొత్తు పెట్టుకోవద్దు ,ఇన్నేళ్లుగా మీరు పొత్తు పెట్టుకోలేదు , అలాగే ఇప్పుడు పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియదు కానీ తెలుగుదేశం పార్టీతో మీరు గనక పొత్తు పెట్టుకుంటే రానున్న ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ కు బిజెపికి అటు ఇటుగా వస్తే , కచ్చితంగా నా అడుగులు కాంగ్రెస్ పార్టీ వైపు పడతాయని వారికి బల్లగుద్ది చెప్పేందుకు జగన్ వెళ్లినట్లు తెలుస్తోంది.ఇక ఆంధ్రప్రదేశ్లో గనక బిజెపి పొత్తు కోసం మళ్ళీ తెలుగుదేశం పార్టీ వెంట వస్తే2024 ఫలితం రిపీట్ అయ్యే అవకాశం ఉందనే భయం జగన్మోహన్ రెడ్డిలో బాగా కనిపిస్తుందని చెప్పాలి. కాబట్టి అది జరగకుండా ఉండేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే దీనికి బిజెపి పార్టీ కూడా కచ్చితంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో కూడా బిజెపి పార్టీకి ఓటు బ్యాంకు ఉందేమో కానీ కేరళ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అస్సలు లేదు. ఒకపక్క కర్ణాటకలో మొన్నటి వరకు వాళ్లు అధికారం చలాఇంచారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాస్తంత వేవ్ చూపించగలిగారు . ఇక తమిళనాడులో ఇప్పుడిప్పుడే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం వారికి ఏమాత్రం స్కోప్ లేదు. ఎలాంటి స్కోప్ లేకుండానే 20 ఎంపీలు గెలిస్తే 20 , 18 గెలిస్తే 18 , 15 గెలిస్తే 15 మీకే సపోర్ట్ ఇస్తామని… కానీ ఇప్పుడు పొత్తు మాత్రం పెట్టుకోకండి ఆంధ్ర ప్రదేశ్లో అని జగన్మోహన్ రెడ్డి కోరినప్పుడు, చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి పొత్తు నడుస్తున్న సమయంలో మోడీ రిస్క్ తీసుకుని వారి వైపు నిలబడతారా లేక జగన్ వైపు నిలబడతారా అనేది ఇప్పుడు ఒక బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి అడుగుపెడుతూనే ఈ విధమైనటువంటి కండిషన్స్ తో అమిత్ షాను కలిశారని తెలుస్తోంది. అలాగే జగన్ పెట్టిన కండిషన్ కేజ్ అమిత్ షా కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది తీవ్ర చర్చానియాంశంగా మారింది.