Virat Kohli : ఆ బౌలర్ పేరెత్తితేనే చిరాకుపడుతున్న విరాట్ కోహ్లీ.. మూడు సెంచరీలు ఆ బౌలర్ వల్లే మిస్.. కోహ్లీకే సవాల్ విసురుతున్న ఆ బౌలర్ ఎవరో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Virat Kohli : ఆ బౌలర్ పేరెత్తితేనే చిరాకుపడుతున్న విరాట్ కోహ్లీ.. మూడు సెంచరీలు ఆ బౌలర్ వల్లే మిస్.. కోహ్లీకే సవాల్ విసురుతున్న ఆ బౌలర్ ఎవరో తెలుసా?

Virat Kohli : విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వరల్డ్ లోనే బెస్ట్ క్రికెటర్లలో ఒకడు. కోహ్లీ బ్యాటింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఎందరో బౌలర్లు.. విరాట్ కోహ్లీని ఔట్ చేయలేక చేతులెత్తేశారు. ఐపీఎల్ లోనూ విరాట్ కోహ్లీ ప్రదర్శన బాగానే ఉండేది కానీ.. జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఏది ఏమైనా.. క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైన పేజీలు ఉంటాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :10 October 2023,12:00 pm

Virat Kohli : విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వరల్డ్ లోనే బెస్ట్ క్రికెటర్లలో ఒకడు. కోహ్లీ బ్యాటింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఎందరో బౌలర్లు.. విరాట్ కోహ్లీని ఔట్ చేయలేక చేతులెత్తేశారు. ఐపీఎల్ లోనూ విరాట్ కోహ్లీ ప్రదర్శన బాగానే ఉండేది కానీ.. జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఏది ఏమైనా.. క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైన పేజీలు ఉంటాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఎందరో బౌలర్లను కోహ్లీ ఓ ఆటాడుకుంటే.. కోహ్లీని ఓ బౌలర్ ఆటాడుకుంటున్నాడు. ఎంతలా అంటే.. కోహ్లీ సెంచరీ కాకుండా.. సెంచరీ చేయకుండా ఆ బౌలర్ కట్టడి చేస్తున్నాడు. ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు కోహ్లీకి ఇలా జరిగింది. అతడి బౌలింగ్ లోనే కోహ్లీ సెంచరీకి చేరువలో ఉండగా మూడు సార్లు ఔట్ అయ్యాడు. ఇంతకీ ఆ బౌలర్ ఎవరు అంటారా? ఇంకెవరు ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్ వుడ్.

మొన్న ఆదివారం జరిగిన మ్యాచ్ లోనూ విరాట్ కోహ్లీకి అలాంటి దెబ్బే ఎదురైంది. విరాట్ కోహ్లీ మొన్నటి మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించాడనే చెప్పుకోవాలి. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ కలిసి పార్టనర్ షిప్ తో గేమ్ ను ఎక్కడికో తీసుకెళ్లారు. చివరకు 85 సొంత పరుగులు చేసిన కోహ్లీ.. ఇంకో 15 పరుగులు చేసి వన్డే ప్రపంచ కప్ లో సెంచరీ చేయాలని తెగ ఆరాటపడ్డాడు. కానీ.. హఏజిల్ వుడ్ షార్ట్ బాల్ వేయడంతో.. మిడ్ వికెట్ వైపు కోహ్లీ పుల్ చేయబోయి.. లబుషేన్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో సెంచరీకి చేరువలోకి వచ్చి కోహ్లీ ఔట్ అయ్యాడు. ఇలా కోహ్లీ ఔట్ అవ్వడం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు 2020 లో కూడా ఒకసారి హేజిల్ వుడ్ కోహ్లీని ఔట్ చేశాడు. ఇంకోసారి కూడా అలాగే ఔట్ చేశాడు.

virat kohli missed 3 centuries because of josh hazlewood

#image_title

Virat Kohli : మూడు సార్లు కోహ్లీని సెంచరీ చేయకుండా ఆపేసిన హేజిల్ వుడ్

2020 నుంచి మూడు సార్లు 80కి పైగా పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఉన్న కోహ్లీని మూడు సార్లు హేజిల్ వుడ్ సెంచరీ చేయకుండా ఔట్ చేశాడు. అది కూడా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లలోనే. ఒకసారి 87 పరుగులు చేసిన తర్వాత ఔట్ చేయగా, మరోసారి 89 పరుగుల వద్ద ఔట్ చేశాడు. మొన్న వన్డ్ వరల్డ్ కప్ మ్యాచ్ లో ఏకంగా 85 పరుగుల వద్ద ఔట్ చేశాడు. ఇలా మూడు సార్లు ఔట్ చేసి కోహ్లీకి హేజిల్ వుడ్ చిరాకు తెప్పించాడు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది