Revanth Reddy : వారందరికీ గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్ లోకి రూ.5లక్షలు వేయనున్న రేవంత్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : వారందరికీ గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్ లోకి రూ.5లక్షలు వేయనున్న రేవంత్..!

 Authored By ramu | The Telugu News | Updated on :2 June 2024,7:19 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : వారందరికీ గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్ లోకి రూ.5లక్షలు వేయనున్న రేవంత్..!

Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్కో హామీని వరుసగా అమలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఎంపీ ఎన్నికలకు ముందే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఉచిత గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చాలా పథకాలను ఇంకా అమలు చేయాల్సి ఉండేది. అయితే తాజాగా రేవంత్ సర్కార్ ఇంకొన్ని పథకాలను అమలు చేయాలని చూస్తోంది. ఎందుకంటే అటు ప్రతిపక్షాల నుంచి పథకాల అమలుపై తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. అందుకే ఇప్పుడు రేవంత్ వాటిని అమలు చేయాలని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే కొన్ని పథకాలపై కేబినెట్ ఆమోదం తెలిపింది.

Revanth Reddy వారంతా హాజరు..

ఇక తాజాగా జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా రేవంత్ తో పాటు గవర్నర్, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వేడుకల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా రేవంత్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మరిన్ని పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. తమది ప్రజా పాలన అని.. ప్రజల కోసం అన్నీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు వారు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కూడా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చాలా మంది నిరుపేదలు సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయన తెలిపారు.

Revanth Reddy వారందరికీ గుడ్ న్యూస్ త్వరలోనే అకౌంట్ లోకి రూ5లక్షలు వేయనున్న రేవంత్

Revanth Reddy : వారందరికీ గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్ లోకి రూ.5లక్షలు వేయనున్న రేవంత్..!

వారంతా సొంత ఇంటి కలను నిజం చేసుకోవడానికి సర్కార్ అండగా ఉంటుందని చెప్పారు. చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పతకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన వివరించారు. ఇన్ని రోజులు ఎన్నికల కోడ్ ఉండటం వల్ల ఆలస్యం జరిగినట్టు చెప్పారు. త్వరలోనే ఎన్నికల కోడ్ అయిపోతుంది కాబట్టి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున.. ప్రతి ఏడాది 4.50 ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందని అన్నారు. తొలి ఏడాది ఇళ్ల నిర్మాణం కోసం రూ.7,740 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బడ్జెట్ లో నిధులను సక్రమంగా కేటాయిస్తున్నామని తెలిపారు రేవంత్. ఇందులో భాగంగా ఈ ఒక్క ఏడాదే 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది