Guppedantha Manasu 7 Nov Today Episode : విష్ కాలేజీలో రిషి, వసుధారకు షాక్.. ఏంజెల్ ప్రత్యక్షం.. జగతిని కాల్చింది ఎవరో ముకుల్ తెలుసుకున్నాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guppedantha Manasu 7 Nov Today Episode : విష్ కాలేజీలో రిషి, వసుధారకు షాక్.. ఏంజెల్ ప్రత్యక్షం.. జగతిని కాల్చింది ఎవరో ముకుల్ తెలుసుకున్నాడా?

 Authored By gatla | The Telugu News | Updated on :7 November 2023,8:40 am

ప్రధానాంశాలు:

  •  విష్ కాలేజీకి వెళ్లిన రిషి, వసుధార

  •  విష్ కాలేజీకి వచ్చిన ఏంజెల్

  •  ఇంటికి వెళ్లిన అనుపమ

Guppedantha Manasu 7 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 7 నవంబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 914 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. విష్ కాలేజీ నుంచి ఆహ్వానం అందడంతో తాము విష్ కాలేజీకి వెళ్తున్నామని మహీంద్రాకు చెబుతాడు రిషి. దీంతో ఇప్పుడు ఆ కాలేజీకి ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతాడు మహీంద్రా. దీంతో ఆ కాలేజీకి మాకు సంబంధం ఉంది కదా మామయ్య అంటుంది వసుధార. మేము పాత లెక్చరర్స్ కదా అంటుంది. మాతో పాటు మీరు కూడా రావాలి డాడ్ అంటాడు రిషి. దీంతో మహీంద్రాకు ఏం చెప్పాలో అర్థం కాదు. మేము వెయిట్ చేస్తుంటాం. వెళ్లి రెడీ అవ్వండి అంటాడు రిషి. నన్ను ఇంతలా ఎందుకు రమ్మని అడుగుతున్నారు. మీరిద్దరూ వెళ్లండి అంటాడు మహీంద్రా. నాకు అర్థం అయింది. నేను తాగుతాను. మళ్లీ ఎక్కడికైనా వెళ్తాను అనే కదా మీ డౌట్. ఆ భయం వెనుక నా మీద జాగ్రత్త, ప్రేమ ఉన్నాయని తెలుసు. ఎక్కువ శాతం తాగను. తాగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. మీరు వచ్చేవరకు నేను జగతితోనే ఉంటాను. అస్సలు తాగను అంటాడు మహీంద్రా. నేను మాటిస్తే తప్పే అలవాటు లేదు. వచ్చిన తర్వాత మీ అమ్మను సాక్ష్యం కూడా అడగొచ్చు అంటాడు మహీంద్రా.

మామయ్య.. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను చేస్తారా? అంటుంది వసుధార. ఏంటి అని అడుగుతాడు మహీంద్రా. నేను రిషి సార్.. విష్ కాలేజీకి వెళ్తున్నాం కదా. మీరు ఇప్పుడు డీబీఎస్టీ కాలేజీకి వెళ్లాలి అని అడుగుతుంది వసుధార. చెప్పండి మామయ్య.. వెళ్తారా? అంటే నా వల్ల కాదు. నేను వెళ్లలేను. నేను ఆ కాలేజీకి వెళ్తే నాకు జగతి గుర్తొస్తుంది. నేను అక్కడికి వెళ్లి నేను తన మెమోరీస్ తో బతకలేను అంటాడు మహీంద్రా. వద్దులే డాడ్ మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. నేను పెదనాన్నకు ఫోన్ చేసి చెప్పాను. ఆయన చూసుకుంటారు అంటాడు రిషి. వసుధార మనం విష్ కాలేజీకి వెళ్లడానికి ముందు అమ్మను షూట్ చేసిన ప్లేస్ కి వెళ్లాలి. స్పెషల్ ఆఫీసర్ ముకుల్ కూడా అక్కడికి వస్తారు అని చెబుతాడు రిషి. దీంతో సరే సార్ అంటుంది వసుధార. ముకుల్.. జగతిని కాల్చిన ప్లేస్ కు వస్తాడు. పాండ్యన్ కూడా వస్తాడు. పాండ్యన్ ను ఏం జరిగిందో అడిగి తెలుసుకుంటాడు ముకుల్. ఎందుకు రమ్మని పిలిచారు అంటే.. ఆరోజు స్పాట్ లో ఏం జరిగిందో క్లియర్ గా తెలుసుకోవడం కోసం వచ్చాను అంటాడు ముకుల్.

Guppedantha Manasu 7 Nov Today Episode : జగతిని కాల్చిన ప్లేస్ లో దర్యాప్తు చేసిన ముకుల్

దీంతో ఆరోజు అమ్మ ఫోన్ చేసి నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పడంతో నేనే అమ్మకు ఈ లొకేషన్ పంపి రమ్మని చెప్పాను. ముందు నేను వచ్చాను. ఆ తర్వాత అమ్మ వచ్చింది. ఇంతంలో వసుధార వచ్చి ఇక్కడ ఉండకూడదు. వెంటనే వెళ్లిపోవాలి అని చెప్పింది. అయితే.. నా మీద ఇప్పటికే అటాక్స్ జరిగాయి. వాటి గురించి నాకు చెప్పడానికి అమ్మ వచ్చి ఉంటుంది అని అనుకున్నాను. ఇక్కడ ప్రమాదం ఉంది.. వెళ్దాం సార్ అని వసుధార అంటూనే ఉంది. ముందు రండి సార్ అంది. వసుధార.. ఈ రోజుతో నిజం ఏంటో తెలియాలి అని నేను అక్కడే ఉన్నాను. ఇంతలో నన్ను కాల్చబోతుండగా అమ్మ అడ్డం రావడంతో బుల్లెట్ తగిలింది. ఆ క్షణంలో ఒక్కసారిగా నా ప్రాణం పోయినట్టుగా అనిపించింది. ఒక్కసారిగా కుప్పకూలిన అమ్మను చూసి ఏం చేయాలో అర్థం కాలేదు. నా బాడీ మొత్తం షివరింగ్ వచ్చింది అంటాడు రిషి. ఆ షూటర్ అటు వైపు నుంచి కాల్చాడు అని చెబుతాడు రిషి. దీంతో ఆ ఇంటి వైపు చూస్తాడు ముకుల్.

ఆ ఇంటి వైపు వెళ్లి పైకి ఎక్కి చూస్తాడు. సరిగ్గా కిల్లర్ ఏ ప్లేస్ లో నుంచి ఎక్కి కాల్చుతాడో అదే ప్లేస్ కు వెళ్తాడు ముకుల్. అక్కడికి వచ్చిన మరో ఆఫీసర్.. వెంటనే శైలేంద్రకు ఫోన్ చేసి అన్ని విషయాలు చెబుతాడు. ఈ కేసు త్వరగానే సాల్వ్ అయ్యే చాన్స్ ఉంది అంటాడు. నువ్వు వాడి ప్రతి కదలిక నాకు చెప్పాలి అంటాడు శైలేంద్ర. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను దొరకను అని అనుకుంటాడు శైలేంద్ర…మీరు వచ్చిన తర్వాతే ఆ షూటర్ వచ్చాడు. ఆ షూటర్ బైక్ మీద వచ్చాడు. ఆ బైక్ నెంబర్, అడ్రస్ ట్రేస్ అవుట్ చేశాం. మూడు రోజుల తర్వాత డెడ్ బాడీ కనిపించింది. అతడి మొబైల్ నెంబర్ కూడా దొరికింది. మొబైల్ నెంబర్ డిటెయిల్స్ కోసం టెక్నీషియన్స్ కి ఇచ్చాం అంటాడు ముకుల్. ఏ చిన్న క్లూ లేకుండా చేశాడు ఆ క్రిమినల్. కానీ.. ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా పట్టుకుంటాం అంటాడు ముకుల్.

మరోవైపు విష్ కాలేజీ యాజమాన్యం.. వసుధార, రిషి కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో వసుధార, రిషి కాలేజీకి వస్తారు. వాళ్లకు కాలేజీ ప్రిన్సిపల్, విద్యార్థులు స్వాగతం పలుకుతారు. వెల్ కమ్ సార్.. వెల్ కమ్ టు విష్ కాలేజీ అంటారు. మీరిద్దరూ ది బెస్ట్ కపుల్ గా నిలిచిపోతారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా ఉండిపోతారు. గ్రాండ్ వెల్ కమ్ సార్.. విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటారు.

ఇంతలో అక్కడికి ఏంజెల్ వస్తుంది. రిషి, వసుధారను చూసి షాక్ అవుతుంది. హాయ్ ఏంజెల్ బాగున్నావా? అంటే ఏంటి రిషి ఇది అంటుంది ఏంజెల్. ఇక్కడ ఏ విషయాలు మాట్లాడకు. మనం ఇంటికి తీసుకెళ్లి మాట్లాడుదాం అంటాడు వాళ్ల నాన్న. ఇక్కడే ఉన్నారు ఏంటి.. పదండి లోపలికి వెళ్దాం అంటాడు ఏంజెల్ నాన్న. చాలా థాంక్స్ నీ భార్యను చూపించినందుకు అంటుంది.

మీరిద్దరూ ఈ కాలేజీలో అడుగుపెట్టాక ఈ కాలేజీ రూపురేఖలు మారిపోయాయని, స్టూడెంట్స్ కూడా మారిపోయారని అంటాడు ప్రిన్సిపాల్. ఉత్తీర్ణత శాతం కూడా మీరు వచ్చాకే పెరిగింది. కాలేజీకి మీరు ఏంతో చేశారు అంటాడు. కాలేజీకి చాలా హెల్ప్ చేశారు. కానీ.. తెలియకుండా కూడా చాలా చేశారు అంటాడు ఏంజెల్ తండ్రి. మరోవైపు అనుపమ.. ఇంటికి వస్తుంది. తన రూమ్ లోకి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది