Intinti Gruhalakshmi 15 Nov Today Episode : సరస్వతికి గుండెనొప్పి.. ఆపరేషన్ కు 10 లక్షలు కావాలన్న డాక్టర్లు.. వైజాగ్ వెళ్తున్న తులసికి ఈ విషయం తెలుస్తుందా? అఖిల్ ఎవరో విక్రమ్ కు తెలుస్తుందా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Intinti Gruhalakshmi 15 Nov Today Episode : సరస్వతికి గుండెనొప్పి.. ఆపరేషన్ కు 10 లక్షలు కావాలన్న డాక్టర్లు.. వైజాగ్ వెళ్తున్న తులసికి ఈ విషయం తెలుస్తుందా? అఖిల్ ఎవరో విక్రమ్ కు తెలుస్తుందా?

Intinti Gruhalakshmi 15 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 15 నవంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 1102 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందుకు అనసూయ వెళ్లి కాఫీ ఇస్తుంది. దీంతో వద్దు అంటాడు. ఎందుకు అంటే.. ఈ లోకంలో అందరికీ కోరికలు ఉంటాయి కానీ నాకు తప్ప. ఎవరు ఏం చెప్పినా ఎవ్వరినీ ఏం అనకూడదు. నోర్మూసుకొని కూర్చోవాలి అంటాడు నందు. దీంతో […]

 Authored By gatla | The Telugu News | Updated on :15 November 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  దివ్య, అఖిల్ మధ్య ఉన్న సంబంధం ఏంటి?

  •  తులసికి నందు తన మనసులో ప్రేమను చెబుతాడా?

  •  సరస్వతికి గుండెనొప్పి.. ఆపరేషన్ చేసినా బతుకుతుందా?

Intinti Gruhalakshmi 15 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 15 నవంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 1102 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందుకు అనసూయ వెళ్లి కాఫీ ఇస్తుంది. దీంతో వద్దు అంటాడు. ఎందుకు అంటే.. ఈ లోకంలో అందరికీ కోరికలు ఉంటాయి కానీ నాకు తప్ప. ఎవరు ఏం చెప్పినా ఎవ్వరినీ ఏం అనకూడదు. నోర్మూసుకొని కూర్చోవాలి అంటాడు నందు. దీంతో పరందామయ్యను పిలుస్తుంది అనసూయ. ఏమైందిరా అంటే.. ఆవిడ ఏంటి అలా మాట్లాడుతోంది. ఎవరు అంటే తులసి అమ్మ గారు అంటాడు. ఏమన్నారు అంటే.. నాకు బుద్ధి వచ్చింది. మళ్లీ తులసితో నేను జీవితం పంచుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పాను. దీంతో తులసి జోలికి మరోసారి వెళ్లొద్దు అని నాకే వార్నింగ్ ఇస్తోంది అంటాడు నందు. మళ్లీ తులసిని వదిలేయవని గ్యారెంటీ ఏంటి అని ఆమె భయం కావచ్చు అంటాడు పరందామయ్య. ఆమె మాకు చెప్పింది. మీవాడు దూకుడు మీద ఉన్నాడు. కళ్లెం వేసి పట్టుకోండి అని చెప్పి ఆమె వెళ్లింది అంటాడు పరందామయ్య. దీంతో మా వాడు మారిపోయాడు అని చెప్పలేకపోయారా? అంటే ఆమె వినిపించుకుంటే కదా అంటుంది అనసూయ. ఇక.. ఈ పని ఎవ్వరితో కాదు. తులసితో నేనే మాట్లాడుకుంటా అంటాడు నందు. దీంతో వద్దు నువ్వు ఆ పని చేయకు. తులసే నీ దగ్గరికి వచ్చేలా చేసుకో అంటుంది అనసూయ. తొందరపడి మాట జారి తులసిని దూరం చేసుకోకు. ఇలాగే దగ్గరవ్వు అంటుంది అనసూయ. దీంతో ఇలా మీనవేషాలు వేస్తూ కూర్చొంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అని అంటాడు నందు.

మరోవైపు మేనేజర్.. తులసిని కలవడానికి వస్తాడు. మీ సీఈవో పదవి ప్రమాదంలో పడబోతుందని చెప్పడానికి వచ్చాను అంటాడు మేనేజర్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ మనవైపే ఉన్నారు కదా అంటుంది. దీంతో శ్రీనివాస్ గారు తెలుసు కదా. ఆర్కే గ్రూప్ వాళ్లు ఎప్పటి నుంచో మన కంపెనీ షేర్స్ ను కొనడానికి ట్రై చేస్తున్నారు అంటాడు మేనేజర్. వాళ్లు షేర్స్ కొనాలని అనుకున్నది మన కంపెనీని ముంచడానికి. శ్రీనివాస్ గారు తన దగ్గర ఉన్న షేర్స్ ను ఆర్కే గ్రూప్ కి అమ్మడానికి రెడీ అయ్యారు. ఆల్ మోస్ట్ ఫైల్ అయినట్టే అంటాడు. వెంటనే శ్రీనివాస్ ను కలిసి ఆయన షేర్స్ ను అమ్మకుండా చేయాలి అంటాడు మేనేజర్. దీంతో వెంటనే వెళ్దాం పదా అంటుంది తులసి. దీంతో ఆయన ఇక్కడ ఉండరు. వైజాగ్ లో ఉంటారు అంటాడు మేనేజర్. దీంతో వెంటనే వైజాగ్ వెళ్లడానికి మాకు టికెట్స్ బుక్ చేయండి అంటుంది తులసి. దీంతో సరే మేడమ్ అంటాడు మేనేజర్. మరోవైపు ఒక రోజంతా నేను తులసితో కలిసి ఉంటాను. ఇప్పుడు కంపెనీ సమస్యతో పాటు నా సమస్య కూడా పరిష్కారం అవుతుంది అని అనుకుంటాడు నందు.

Intinti Gruhalakshmi 15 Nov Today Episode : దివ్యను కలిసి తన మీద ఒట్టేసిన అఖిల్

అఖిల్ మళ్లీ దివ్యను కలవడానికి వస్తాడు. ఎందుకు నువ్వు మళ్లీ వచ్చావు అంటుంది దివ్య. నీతో కొంత సేపు మాట్లాడాలి అంటాడు అఖిల్. నువ్వంటే నాకు చాలా ఇష్టం దివ్య. నిన్ను ఆరాధిస్తున్నాను కానీ.. నీ కాపురం చెడగొట్టే ఉద్దేశం నాకు లేదు అంటాడు అఖిల్. దీంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంటుంది దివ్య. దీంతో నీ మీద ఒట్టేసి చెబుతున్నా అంటాడు అఖిల్. దీంతో తన చేయిని దివ్య మీద వేస్తాడు. తన చేయి తీయబోతుండగా ఇంతలో విక్రమ్ అక్కడికి వస్తాడు. విక్రమ్ చూసేశాడు.. ఇప్పుడు నేను చెప్పినా అపార్థం చేసుకుంటాడు అని అనుకుంటుంది. విక్రమ్ రాగానే వెళ్లిపోబోతాడు అఖిల్. దీంతో ఆపి ఇతడేనా నీ చిన్ననాటి ఫ్రెండ్ అని అడుగుతాడు విక్రమ్.

నా పేరు అఖిల్ సార్ అంటాడు. ఎందుకు వచ్చావు అంటే.. తను పిలిస్తే వచ్చాను అంటాడు. దీంతో రిసార్ట్ లో అఖిల్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడటం చూస్తాడు విక్రమ్. కత్తి లాంటి ఫిగర్ దొరికింది. తనను లైన్ లో పెట్టే డీల్ కుదిరింది అని తన ఫ్రెండ్ తో చెప్పడం వింటాడు విక్రమ్. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు చెప్పు అని ప్రశ్నిస్తాడు విక్రమ్.

దీంతో అసలు జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు అఖిల్. రిసార్ట్ లో మీ ఎదురు రూమ్ లో ఉండే ఆ బాష, జాఫ్రిన్ నాతో ఈ పని చేయించారు అని చెబుతాడు విక్రమ్. దీంతో అఖిల్ ను అక్కడి నుంచి వెళ్లగొట్టి అసలు వాళ్లు ఎందుకు ఇలా చేయిస్తున్నారు అని అనుకుంటారు దివ్య, విక్రమ్. మరోవైపు సరస్వతికి టిఫిన్ తెచ్చి ఇస్తుంది దీపక్ భార్య. నాకు ఏదీ వద్దు అంటుంది సరస్వతి. దీంతో దీపక్ వచ్చి ఏమైంది అమ్మ అని అడుగుతాడు.

ఆ నంద గోపాల్ అసలు ఏం అనుకుంటున్నాడు అని అంటుంది. మనం చెప్పినా వినేటట్టు లేడు అని అంటుంది. తన జీవితంలో పెళ్లి మాట లేదు అని ఖరాఖండిగా చెప్పేసింది అంటుంది సరస్వతి. అలాంటప్పుడు అక్క కూడా వదిలేయాలి కదా. ఆయనతో కలిసి ఎందుకు తిరగాలి. కలిసి కెఫే ఎందుకు నడపాలి అని అంటాడు దీపక్. అక్కడ దగ్గర కూడా తప్పు ఉంది అంటాడు దీపక్.

అక్కను ఒంటరిగా వదిలిపెట్టకురా. అది ఈ ఇంటి ఆడపడుచు అంటుంది సరస్వతి. దీంతో అమ్మ నాకు తెలుసు. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటాడు దీపక్. ఇంతలో సరస్వతికి గుండెలో నొప్పి వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తారు.

మరోవైపు నందు, తులసి ఇద్దరూ కారులో వెళ్తుంటారు. తులసి టెన్షన్ గా ఉంటుంది. ఏమైంది టెన్షన్ గా ఉన్నావు అని అడుగుతాడు నందు. దీంతో ఒక పెద్ద సమస్యను మోసుకొని వైజాగ్ వెళ్తున్నాం అని అంటుంది తులసి. మరోవైపు ఎలాగైనా తన మనసులో మాట చెప్పాలని అనుకుంటాడు నందు.

మరోవైపు బాషా గురించి కనుక్కునేందుకు మళ్లీ రిసార్ట్ కు వెళ్తారు దివ్య, విక్రమ్. వాళ్లు ఇంతకుముందే రూమ్ వెకేట్ చేసి వెళ్లిపోయారట అంటాడు విక్రమ్. వాళ్లు పారిపోయారట అని చెబుతాడు విక్రమ్. వాళ్ల గురించి మనకు తెలిసిపోయిందని అనుమానం రాగానే భయపడి పారిపోయారు అని అంటాడు విక్రమ్.

వాళ్లు మారువేషంలో వచ్చినట్టు అనిపిస్తోంది అంటాడు విక్రమ్. మరోవైపు సరస్వతిని ఆసుపత్రిలో చేర్పిస్తారు. పొజిషన్ చాలా క్రిటికెట్ గా ఉంది. ఆపరేషన్ కు పది లక్షలు ఖర్చు అవుతుంది అని అంటారు డాక్టర్లు. దీంతో దీపక్ కు ఏం చేయాలో తెలియదు. తులసికి ఫోన్ చేస్తాడు. కానీ.. తులసి ఫోన్ ను నందు లిఫ్ట్ చేసి ఇక్కడ నా ప్రయత్నం ఏదో నేను చేసుకుంటున్నా కదా. మధ్యలో మీరెందుకు తులసికి తెగ ఫోన్లు చేస్తున్నారు అంటాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది