Viral Video : పట్టపగలు నడిరోడ్డుపై కొట్టుకున్న పోలీసులు .. డబ్బులు పంచుకునే విషయంలో గొడవ.. వీడియో!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : పట్టపగలు నడిరోడ్డుపై కొట్టుకున్న పోలీసులు .. డబ్బులు పంచుకునే విషయంలో గొడవ.. వీడియో!!

 Authored By aruna | The Telugu News | Updated on :21 September 2023,10:00 am

Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. కేవలం సెలబ్రిటీలే కాదు సామాన్య ప్రజలు కూడా ఈ సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు హల్చల్ చేస్తూ ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్వింప చేసేలా ఉంటాయి. మరి కొన్ని వీడియోలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో లో ఇద్దరు పోలీసులు నడిరోడ్డు పైన కొట్టేసుకున్నారు.

ప్రజల భద్రత ప్రజా అవసరాలు తీర్చే న్యాయవ్యవస్థ అయినటువంటి పోలీసు శాఖ ఇలా నడిరోడ్డుపై కొట్టుకోవడం అందరికీ షాకింగ్ గా అనిపించింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బీహార్ నలంద జిల్లాలోని సోహార్సే పోలీస్ స్టేషన్లోని ఇద్దరు పోలీసులు ఒక కేసు కు సంబంధించి వచ్చిన సొమ్మును పంచుకునే విషయంలో గొడవపడ్డారు. వాహనం లో నుంచి దిగి అందరూ చూస్తుండగానే వారిద్దరూ గొడవపడ్డారు. ఏకంగా ఇద్దరు ఒకరినొకరు దారుణంగా కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఒక పోలీసు అధికారి అయితే ఏకంగా పోలీసు వాహనం లో నుంచి కర్ర తీసుకొని మరి తన తోటి అధికారిని విపరీతంగా కొట్టారు.

The police beat on the road for money

The police beat on the road for money

అటుగా వెళుతున్న జనాలంతా ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. కొందరు ఆపడానికి ప్రయత్నం చేస్తున్న పోలీసు అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఒకరినొకరు కొట్టుకుంటూనే ఉన్నారు. కాసేపటికి కొందరు వ్యక్తులు పోలీసు అధికారులను ఆపి ప్రయత్నం చేశారు. దీనితో పోలీసు అధికారులు గొడవ పడటం ఆపారు. ఈ తతంగాన్ని మొత్తం అక్కడే ఉన్న ఒక వ్యక్తి తన సెల్ఫోన్ కెమెరాలో బంధించాడు. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త ఇలా వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందించారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది