AP Good News : మందుబాబుల‌కి గుడ్ న్యూస్.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యంతో ఇక నుండి అన్ని బ్రాండ్స్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Good News : మందుబాబుల‌కి గుడ్ న్యూస్.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యంతో ఇక నుండి అన్ని బ్రాండ్స్..

 Authored By ramu | The Telugu News | Updated on :9 June 2024,1:16 pm

ప్రధానాంశాలు:

  •  AP Good News : మందుబాబుల‌కి గుడ్ న్యూస్.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యంతో ఇక నుండి అన్ని బ్రాండ్స్..

AP Good News : వైఎస్సార్సీపీ పాలనలో మద్యం పేరుతో అందినకాడికి దోచేశారన్నది తెలుగుదేశం మొదటి నుంచీ చెబుతూ వస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ పెద్దలు, వైఎస్సార్సీపీ ముఖ్యనాయకులు మద్యం విధానంలో కొనసాగించిన దోపిడీకి వాసుదేవరెడ్డే కళ్లు, చెవులు సహా అన్నీ తానై వ్యవహరించారనే ఫిర్యాదులు రావ‌డం మ‌నం చూశాం. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టగానే ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీగా, డిస్టిలరీస్, బ్రూవరీస్‌ కమిషనర్‌గా ఐఆర్‌టీఎస్‌ అధికారి వాసుదేవరెడ్డిని నియమించుకున్నారు. నాలుగున్నరేళ్ల పాటు ఆ పోస్టులో కొనసాగి వైఎస్సార్సీపీ నాయకులు, ప్రభుత్వ పెద్దలు బినామీల పేరుతో ఏర్పాటు చేసిన మద్యం సరఫరా కంపెనీలు తయారుచేసే ‘జే బ్రాండ్లు’ మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లో లభ్యమయ్యేలా చేసింది ఈయనేనని టీడీపీ గుర్తించింది.

AP Good News మ‌ద్యం ప్రియుల‌కి గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా మొదలుకుని విక్రయాల వరకూ అన్నింటా వ్యవస్థీకృతంగా సాగించిన ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ కుంభకోణంలో సూత్రధారులుగా ఉన్న నేతలు, పాత్రధారులైన అధికారులు, ప్రభుత్వ పెద్దలు, అధికారపార్టీ కీలక నాయకుల బినామీలు, సన్నిహితులుగా పేరొందిన వారి నివాసాలు, కార్యాలయాల్లో, అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థల్లో ఎక్కడ సోదాలు చేసినా ఈ కుంభకోణం డొంక బయటపడుతుంది. అయితే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రావ‌డంతో నాణ్య‌త గ‌ల మందు స‌రఫ‌రా చేయాల‌ని చూస్తున్నారట‌. ఎన్నిక‌ల ప్ర‌చారంలోను ఆయ‌న ఈ మాట చెప్పారు.

AP Good News మందుబాబుల‌కి గుడ్ న్యూస్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యంతో ఇక నుండి అన్ని బ్రాండ్స్

AP Good News : మందుబాబుల‌కి గుడ్ న్యూస్.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యంతో ఇక నుండి అన్ని బ్రాండ్స్..

ఇప్పుడు టీడీపీ ప్ర‌భుత్వం మ‌ద్యం దుకాణాల‌ని వేలం ద్వారా ప్రైవేట్ వ్య‌క్తుల‌ని ఇవ్వాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తుంది. మ‌ద్యం అమ్మ‌కాలు ప్ర‌భుత్వం ప‌ని కాద‌ని, నాసిక‌రం మందు అమ్మ‌కుండా చూడ‌డ‌మే ప్ర‌భుత్వం ప‌ని అని చంద్ర‌బాబు చూస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ప్రైవేట్ వ్య‌క్తుల‌కి మ‌ద్యం దుకాణాల‌ని అప్ప‌గించే ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులు క‌స‌ర‌త్తులు కూడా మొద‌లు పెట్టార‌ని టాక్ న‌డుస్తుంది. వీటిపై పూర్తి క్లారిటీ రావాలంటే జూన్ 12వ‌ర‌కు ఆగాల్సిందే.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది