Chandrababu Naidu : వైఎస్ జగన్ పాలనపై ప్రశంసల వర్షం కురిపించిన చంద్రబాబు నాయుడు…!
ప్రధానాంశాలు:
Chandrababu Naidu : వైఎస్ జగన్ పాలనపై ప్రశంసల వర్షం కురిపించిన చంద్రబాబు నాయుడు...!
Chandrababu Naidu : ఆంధ్ర రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడుపుతూ ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి పథకం లబ్ధిదారులకు చేరే విధంగా మధ్యలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పాలన సాగాలని ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక దీని ద్వారా ఊరిలో ఉంటున్న యువతకు ఉపాధి కల్పించడంతోపాటు ప్రభుత్వం ఇస్తున్న పథకాలు నేరుగా ఇంటికే వచ్చే విధంగా జగన్ మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే ప్రతినెల మొదటి తేదీన వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి అవ్వ తాతలకు పెన్షన్ ఇచ్చి వస్తున్నారు. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్లు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్నారని చెప్పాలి.
ఈ విధంగా వై.యస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇలాంటి మేలు జరుగుతున్న సరే విపక్షాలు మాత్రం వాలంటీర్ల వ్యవస్థపై పలు రకాల ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇక ఈ వాలంటీర్ల వ్యవస్థను రాజ్యాంగేతర వ్యవస్థ అని గత నాలుగున్నరేళ్లుగా టీడీపీ పార్టీ విమర్శిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ కు వాలంటీర్లు కారణమంటూ వారిపై విరుచుకుపడుతున్నాడు. వాలంటీర్లను ఇండ్ల వద్దకు కూడా రానివద్దని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే కూటమిగా ఏర్పడిన నేతలు వాలంటీర్లను సంఘ వ్యతిరేక శక్తులుగా పోలుస్తున్నారు. ఈ విధంగా గత నాలుగున్నరేళ్లుగా వాలంటీర్ల వ్యవస్థ పై ఆరోపణలు చేసిన టీడీపీ అధినేతలు…ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ వాలంటీర్ వ్యవస్థ సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రోజున శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండలో “రా కదిలి రా” బహిరంగ సభలు నిర్వహించిన చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ… జగన్ ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు సూపర్ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.
అలాగే వాలంటీర్ల వ్యవస్థ అద్భుతమని ఈసారి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను అలాగే కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. అయితే గత కొన్నేళ్లు గా వాలంటీర్ వ్యవస్థ పై తీవ్ర వమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ వ్యవస్థను పొగుడుతూ ప్రశంసల వర్షం కురిపించడం రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. ఇక చంద్రబాబు నాయుడు మాటలు విన్న పలువురు నేతలు అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఈ విధంగా మాట మార్చడని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ రాజకీయ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.