Vijayasai Reddy : రాజ్ కసిరెడ్డిని ఎంకరేజ్ చేసింది నేనే అసలు నిజాలు చెప్పిన‌ విజయసాయిరెడ్డి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vijayasai Reddy : రాజ్ కసిరెడ్డిని ఎంకరేజ్ చేసింది నేనే అసలు నిజాలు చెప్పిన‌ విజయసాయిరెడ్డి

 Authored By ramu | The Telugu News | Updated on :19 April 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Vijayasai Reddy : రాజ్ కసిరెడ్డిని ఎంకరేజ్ చేసింది నేనే అసలు నిజాలు చెప్పిన‌ విజయసాయిరెడ్డి

Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల పరిచయంతోనే తాను రాజ్ కసిరెడ్డికి పరిచయమయ్యానని తెలిపారు. ఆయనలో ఆర్గనైజేషన్‌ స్కిల్స్ చూసి నిజాయితీగా భావించి ప్రోత్సహించానని అన్నారు. అయితే ఆయనపై ప్రస్తుతం వెలుగు చూస్తున్న ఆరోపణలు, క్రిమినల్ మైండ్‌సెట్‌ విషయాలు తనకు అప్పట్లో తెలియలేదని స్పష్టం చేశారు.

Vijayasai Reddy రాజ్ కసిరెడ్డిని ఎంకరేజ్ చేసింది నేనే అసలు నిజాలు చెప్పిన‌ విజయసాయిరెడ్డి

Vijayasai Reddy : రాజ్ కసిరెడ్డిని ఎంకరేజ్ చేసింది నేనే అసలు నిజాలు చెప్పిన‌ విజయసాయిరెడ్డి

 Vijayasai Reddy రాజ్ కసిరెడ్డి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి : విజయసాయిరెడ్డి

“రాజ్ కసిరెడ్డి తెలివైనవాడు. కానీ ఆ తెలివితేటలను మంచి పనులకోసం కాకుండా తప్పుదారి కోసం వాడినందుకు నేను తీవ్రంగా బాధపడుతున్నాను” అని అన్నారు. వైసీపీ పార్టీ వ్యవస్థలో రాజ్‌కి కీలకమైన బాధ్యతలు అప్పగించిందే తానేనని వెల్లడించారు. పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించగలవాడిగా భావించి ఆ నమ్మకంతో కొన్ని బాధ్యతలు అప్పగించానని, కానీ ఆ నమ్మకాన్ని రాజ్ కసిరెడ్డి మోసపూరిత పనులకు వాడుకున్నాడని, అది తనకు తీవ్ర నిరాశను కలిగించిందని పేర్కొన్నారు.

ఈ ఘటనపై విజయసాయి రెడ్డి స్పందన పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఒక వ్యక్తిపై నమ్మకంతో కీలక పదవులు అప్పగించిన నాయకుడి మాటలు ఇప్పుడు పార్టీకి పరువు నష్టం కలిగించేలా మారుతున్నాయి. ఒక వ్యక్తి మేనేజ్‌మెంట్ స్కిల్స్ కంటే అతని నిజమైన నైతిక విలువలు, వ్యక్తిత్వం ముఖ్యమని ఈ ఘటన గుర్తు చేస్తోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది