Roja : నెక్స్ట్ జైల్లోకి నారా లోకేష్ మంత్రి రోజా సీరియస్ వ్యాఖ్యలు..!!

Advertisement

Roja : చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయ ముఖచిత్రం ఒకసారి గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కావాలని రాజకీయ కక్షతో చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేయించారని అంటున్నారు. ఇలా ఉంటే చంద్రబాబుని ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైల్లో పవన్ కళ్యాణ్ కలిసి.. బయటకొచ్చి వచ్చే ఎన్నికలలో టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటన చేయడం జరిగింది.

Advertisement

ఈ ప్రకటనతో పవన్ కళ్యాణ్ కి ప్యాకేజీ అందినట్లు వైసిపి నేతలు విమర్శలు చేశారు. ఇదే విషయాన్ని లోకేష్ వద్ద మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ప్యాకేజ్ ఇచ్చామని వాళ్లే చెబుతున్నారు దమ్ముంటే నిరూపించండి అని సవాలు చేశారు. అయితే లోకేష్ చేసిన సవాలు పై మంత్రి రోజా తాజాగా స్పందించారు. ఈ రకంగానే చంద్రబాబు నాయుడు జగన్ తండ్రి నన్నేం పీకలేకపోయాడు, నా అనుభవమంతా వయస్సు లేదు అని వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా వీర్రవీగి అధికారం మతంతో మాట్లాడిన చంద్రబాబు సాక్షాదారాలతో అడ్డంగా దొరికి జైల్లోకి వెళ్ళాడు.

Advertisement
roja serious comments on Nara Lokesh
roja serious comments on Nara Lokesh

ఇక ఇదే రీతిలో నెక్స్ట్ నారా లోకేష్ కూడా జైల్లోకి వెళ్ళబోతున్నట్లు మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం మేము చేయలేదని దమ్ముంటే జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణకు స్వీకరించి నిరూపించగలరా అని రోజా సవాల్ చేశారు.

Advertisement
Advertisement